ఆదివారం 24 మే 2020
Wanaparthy - Feb 15, 2020 , 23:56:57

గులాబీకే సహకారం

గులాబీకే  సహకారం
  • విండో ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌
  • జిల్లాలో 15 సొసైటీలకు 15 కైవసం

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని సహకార సంఘం ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ మరోసారి గుబాళించింది. జిల్లాలోని 15 సొసైటీలకు గాను అన్నింటిలోనూ టీఆర్‌ఎస్‌ డైరెక్టర్లు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని విజయాన్ని అందించారు. శనివారం సహకార ఎన్నికల పోలింగ్‌ అనంతరం జరిగిన కౌంటింగ్‌ నిర్వహించారు. జిల్లాలోని 15 సంఘాల్లో రేచింతలలోని 13 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలోపాటు మరో 31 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 14 సంఘాల్లోని 151 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కాగా, ఏకగ్రీవాలతో కలుపుకుని మొత్తం 195 డైరెక్టర్‌ స్థానాల్లో 152 టీఆర్‌ఎస్‌, 33 కాంగ్రెస్‌, టీడీపీ 3, సీపీఎం 1, ఇతరులు 6 డైరెక్టర్‌ స్థానాలను గెలుపొందారు. 


నేడు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక..

డైరెక్టర్‌ స్థానాల ఎన్నికలు ముగిసిన క్రమంలో ఆదివారం ఆయా కేంద్రాల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఆయా సొసైటీల్లో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికలను ఆయా సొసైటీల ఎన్నికల అధికారులే నిర్వహిస్తారు. ఒకే పార్టీకి చెందిన డైరెక్టర్లు అధికంగా గెలిచినందున దాదాపుగగా అన్ని సొసైటీల్లో ఎంపికలు సజావుగా జరిగే అవకాశాలున్నాయి. అవకాశం వస్తే చేతులెత్తే పద్ధతిలో కూడా ఎన్నికలను నిర్వహించనున్నారు. ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ఎన్నికను నిర్వహిస్తారు. 


ఫలించిన మంత్రి కృషి..

సహకార సంఘం ఎన్నికల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్దన్‌ రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, చిట్టెం రామోహహన్‌రెడ్డిల కృషి ఫలించింది. ఎన్నికలకు ముందు ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో అన్ని సహకార సంఘాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నది. సహకారంలో ప్రతిపక్షాలకు ఓటర్లు ప్రాధాన్యత లేకుండా చేశారు. ఏ ఒక్క సొసైటీలోనూ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులకు అవకాశం ఇవ్వకుండా డైరెక్టర్‌ స్థానాలను కట్టబెట్టారు. 


logo