శనివారం 30 మే 2020
Wanaparthy - Feb 14, 2020 , 23:29:14

నేడే సహకార పోలింగ్‌

నేడే సహకార పోలింగ్‌
  • విండో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి కేంద్రాలకు తరలిన సిబ్బంది
  • కౌంటింగ్‌ 44,532 మంది ఓటర్లు, 385 మంది పోటీ
  • 14 సంఘాలు.. 151 స్థానాల్లో పోలింగ్‌,

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో సహకార ఎన్నికలు శనివారం జరుగుతున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసి ఆయా కేంద్రాలకు సిబ్బం ది, బ్యాలట్‌ పేపర్లు, బ్యాలెట్‌ బాక్సులను అధికార యంత్రాంగం తరలించింది. మొత్తం 15 సహకార సంఘాలకు గాను, రేచింతల సొసైటీలో అన్ని డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 14 సొసైటీల్లో మరో 31 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 151 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటికోసం 385 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. జనవరి 30న సహకార ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల జరిగిన క్రమంలో నేటి ఓటింగ్‌తో ప్రధాన ఘట్టం ముగిసినట్లవుతుంది. జిల్లా సహకార శాఖ అధికారి కోదండరాములు, డీఆర్డీవో గణేశ్‌జాదవ్‌, ఏఎస్‌పీ షాకీర్‌ హుసేన్‌ల పరిధిలో సహకార ఎన్నికల ఏర్పాట్ల పనులు కొనసాగాయి.


కేంద్రాలకు తరలింపు

సహకార ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో సిబ్బందిని, బ్యాలెట్‌ బాక్సులను, బ్యాలెట్‌ పేపర్లను ఎన్నికలు నిర్వహిస్తున్న కేంద్రాలకు అధికార యంత్రాంగం తరలించింది. వీటి నిర్వహణకు గాను 509 మంది సిబ్బందిని ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. ప్రతి కేంద్రంలో పీవో ఓపీవోలను ఏర్పాటు చేస్తూ పోలింగ్‌ను కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే ఐదు జోన్లు.. ఐదు రూట్లను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. జోన్‌ అధికారులకు మండల ఇంజినీయర్‌ స్థాయి అధికారులను నియమించారు. అలాగే రూట్‌ అధికారులుగా పీఏసీసీఎస్‌ సూపర్‌వైజర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించిన భద్రతా చర్యలను పోలీసులు చేపట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభించి ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.


385 మంది ఎన్నికల్లో పోటీ

14 సహకార సంఘాల్లోని 151 డైరెక్టర్‌ స్థానాల కు 385 మంది పోటీ చేస్తున్నారు. గత 15 రోజులుగా జరుగుతున్న సహకార సమరంలో అభ్యర్థు లు నువ్వా.. నేనా అన్నట్లు ప్రచారాలు చేసుకున్నా రు. సుదూర ప్రాంతాల్లో ఉన్న ఓటరును కూడ వదలడం లేదు. గెలుపోటములు చాలా తక్కువ ఓట్ల శాతంతోనే ఉంటున్నందునా ప్రతి ఓటుకు ప్రాధాన్యత పెరిగింది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రచారాలను వదలడం లేదు. ఉధృతంగా కొనసాగిన ప్రచారాలకు తెరపడగా, ఇక పోలింగ్‌ ఏర్పాట్ల వైపు అభ్యర్థుల చూపు మళ్లి ంది. ఇదిలా ఉంటే, సహకార ఎన్నికల్లో 44,532 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీటిలో శ్రీరంగాపురం, తూంకుం ట, వనపర్తి, గోపాల్‌పేట, పెద్దమందడి, ఘణపు రం, పాన్‌గల్‌, కొప్పునూరు, ఆత్మకూరు, నాగవ రం, రాజనగరం, కొత్తకోట, రామకృష్ణాపురం, పెబ్బేరు సహకార సంఘాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.


logo