బుధవారం 01 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 11, 2020 , 00:41:10

సహకార బరిలో 385 మంది

సహకార బరిలో 385 మంది

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. సోమవారం ఉపసంహరణల గడువు ముగియడంతో తుది జాబితా వెల్లడైంది. 279 మంది తమ నామినేషన్లను ఉపసంహరణ చేసుకున్నారు. చివరకు 385 మంది బరిలో సహకార బరిలో నిలిచారు. జిల్లాలోని 15 సహకార సంఘాల పరిధిలో మొత్తం 195 డైరెక్టర్‌ స్థానాలున్నాయి. వీటిలో 44 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులోను రేచింతల సహకార సంఘం నుంచి 13 స్థానాల్లోను ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే మిగలడంతో ఆ సొసైటీ మొత్తం సభ్యులు ఏకగ్రీవమై ఐక్యతను చాటుకున్నారు. మిగిలిన ఆయా సొసైటీల్లోను 31 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవాలు మినహా మిగిలిన 151 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ స్తానాల్లో 385 మంది బరిలో నిలిచారు. వీరంతా ఈనెల 15వ తేదీన జరిగే పోలింగ్‌ ద్వారా తమ రాజకీయ భవిష్యత్‌ను పరీక్షించుకొబోతున్నారు. చాలా సంఘాల్లో ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు జరిగినా చివరి నిమిషంలో కొలిక్కి రాలేదు. ఏకగ్రీవాలు అయిన వాటిలోను అధికంగా టీఆర్‌ఎస్‌కు చెందిన డైరెక్టర్‌ స్థానాలే అధికంగా ఉన్నాయి.

ప్రచారాలకు పరుగో.. పరుగు..

మూడు రోజులుగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఇక ఉపసంహరణల అనంతరం ప్రచారాలకు తేరలేపారు. జిల్లాలో ఏకగ్రీవాలకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకులు కొంతమేర సఫలీకృతులయ్యారు. ఇక మిగిలిన వార్డుల్లో గెలుపొందేందుకు ఓటర్లను కలుస్తున్నారు. కేవలం ప్రచారాలకు 4 రోజులు మాత్రమే మిగలడంతో అభ్యర్థులు హైరానా పడుతున్నారు. కొద్ది ఓటర్లు ఉన్న స్థానాల్లో అంతగా ఇబ్బందులు లేకున్నా.. ఎక్కువ ఓటర్లున్న స్థానాల్లో అభ్యర్థులకు అవస్థలు ఎదురవుతున్నాయి.  రాత్రిళ్లు కూడా ఓటర్ల ఇంటికి వెళ్లి అభ్యర్థులు కలుస్తున్నారు. ఉపసంహరణల అనంతరం తమకు కేటాయించిన గుర్తులను కూడా ప్రచారాంలోకి తీసుకువెళుతున్నారు. బ్యాలట్‌ నమూనాను ఓటర్లకు చూయించి చైతన్యం చేసుకుంటున్నారు.


logo
>>>>>>