ఆదివారం 29 మార్చి 2020
Wanaparthy - Feb 11, 2020 , 00:35:51

పిల్లలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి

పిల్లలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి

వనపర్తి రూరల్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు దేశంలోని ప్రతి చిన్నారి ఆరోగ్యవంతంగా ఉండేందుకు కడుపులోని నులిపురుగుల నివారణ కోసం ఆల్పెండజోల్‌ మాత్రలు వేయడం జరుగుతుందని జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని చిమనగుంటపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డితో పాటు ఎంపీపీ కిచ్చారెడ్డిలు హాజరై పాఠశాల చిన్నారులచే ఆల్పెండజోల్‌ మాత్రలను మింగించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ గ్రామంలోని చిన్నారులనుంచి 19 సంవత్సరాల వయస్సులోపు వారికి  ఈ మాత్రలను వేయించాలని సూచించారు. ప్రతి చిన్నారి తల్లిదండ్రులు శ్రద్ధవహించి తమ పిల్లలకు ఈ మాత్రలను తినిపించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాజేశ్వరి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా చైర్మన్‌ కురుమూర్తి యాదవ్‌, ఎంపీటీసీ ధర్మశాస్త్రి, కోఆప్షన్‌ మెంబర్‌ శంషోద్దీన్‌, మండల వైద్యాధికారి రాకేష్‌రెడ్డి, సిబ్బంది మహేశ్వరాచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలో..

వనపర్తి, నమస్తే తెలంగాణ/విద్యావిభాగం  : జిల్లా కేంద్రంలోని 8వ వార్డు శ్రీనివాసపురంలో గల అంగన్‌వాడీ కేం ద్రంలో సోమవారం చిన్నారులకు వార్డు కౌన్సిలర్‌ విభూతి నారాయణ నులిపురుగుల నివారణ మాత్రలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులకు ప్రభుత్వం నుంచి వచ్చే గుడ్లను, పౌష్టికాహారాన్ని అందించాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల, మైనార్టీ గురుకుల పాఠశాలలో సోమవారం విద్యార్థులకు నులిపురుగులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్‌ సురేశ్‌, విజితరెడ్డి, అధ్యాపకులు స్రవంతి, సాయిరాంప్రసా ద్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, స్వామి, జగదీశ్వర్‌, సత్య మ్మ, యువరూప, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీటీచర్‌ పాల్గొన్నారు. 

పెద్దమందడిలో..

పెద్దమందడి : నులిపురుగుల నిర్మూలనకు అల్బెండజోల్‌ మాత్రలు వేసుకోవడంతో పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ ఇస్మాయిల్‌ అన్నా రు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ అల్బెండజోల్‌ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు ఓంప్రకాష్‌, లాలమ్మ, శిరీష, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 

పెబ్బేరులో..

పెబ్బేరు/రూరల్‌ : పట్టణంలోని కస్తూర్భగాంధీ పాఠశాలలో నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవా రం ప్రిన్సిపాల్‌ పద్మ విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రల ను అందజేశారు. నులిపురుగుల నివారణ మాత్రలు పిల్ల లు అందించడంతో శారీరకంగా, దృఢత్వంగా ఆరోగ్యంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు. అలాగే పెబ్బేరు మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం పలు పాఠశాలల్లోని విద్యార్థులకు వైద్యారోగ్యశాఖ వారు ఉచిత ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేశారు. కంచిరావుపల్లి ఉన్నత పాఠశాలలో వైద్యాధికారులు సృజన, సాయిశ్రీలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర పర్యవేక్షణాధికారి నాగరాజు పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బం ది చంద్రయ్య, రాజశేఖర్‌, లావణ్యలు నాగలక్ష్మీ, భారతి, మౌనిక తదితరులు ఉన్నారు.

గోపాల్‌పేటలో..

గోపాల్‌పేట : మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల లు, జూనియర్‌ కళాశాల, అంగన్‌వాడీ సెంటర్లలోని 19 సంవత్సరాలలోపు పిల్లలకు వైద్య సిబ్బంది అల్బెండజోల్‌ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి మంజుల మాట్లాడుతూ ఉమ్మడి మండలంలో మొత్తం 12, 149 పిల్లలకు గాను 9,962 మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయడం జరిగిందని ఆమె తెలిపారు.

రేవల్లిలో..

రేవల్లి : మండలంలోని వివిధ గ్రామాలలో పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలను ఆరోగ్యశాఖ సిబ్బంది పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం లక్ష్మి, అంగన్‌వాడీలు అరుణ, పద్య, లోకమాత పాల్గొన్నారు.


logo