శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 11, 2020 , 00:34:36

రేచింతల సహకార సంఘ ఎన్నిక ఏకగ్రీవం

రేచింతల సహకార సంఘ ఎన్నిక ఏకగ్రీవం

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : ప్రాథమిక సహకార పరపతి సంఘాల ఎన్నికల్లో మండలంలోని రేచింతల సింగిల్‌విండో యూనామినస్‌ అయ్యింది. సోమవారం సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుండడంతో 9 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 22 నామినేషన్లు వేసిన 22 మంది అభ్యర్థుల్లో 9 మంది విత్‌డ్రా కాగా 13 మిగిలారు. దీంతో పీఏసీసీఎస్‌ మొత్తంగా ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమైంది. మొత్తం 13 మంది డైరెక్టర్ల స్థానాలకు గాను 9 స్థానాలు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సొంతం చేసుకోగా 2 స్థానాలు కాంగ్రెస్‌, 2 స్థానాలు స్వతంత్ర అభ్యర్థులు సొంతం చేసుకున్నారు. దీంతో రేచింతల సహకార సంఘం అత్యధిక స్థానాలు ఏకగ్రీవం చేసుకున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. 1వ వార్డు నుంచి కొండయ్య, 2వ వార్డు నుంచి హరిజన్‌ నాగన్న, 3వ వార్డు నుంచి గొల్ల తిరుపతన్న, 4వ వార్డు నుంచి గొల్ల కురుమన్న, 5వ వార్డు నుంచి వీ లక్ష్మికాంత్‌రెడ్డి, 6వ వార్డు నుంచి ఎరుకలి హన్మంతు, 7వ వార్డు నుంచి డ్రైవర్‌ బాలయ్య, 8వ వార్డు నుంచి సీ దేవేంద్రం, 9వ వార్డు నుంచి రాములు, 10వ వార్డు నుంచి హరిజన్‌ లక్ష్మమ్మ, 11వ వార్డు నుంచి ఏ  నరేందర్‌రెడ్డి, 12వ వార్డు నుంచి జీ లక్ష్మిదేవమ్మ, 13వ వార్డు నుంచి బీ శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి జగదీశ్‌, సీఈవో రవి ప్రకటించారు. ఈ సందర్భంగా అభ్యర్థులను అభినందించిన వారు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికను తదుపరి ఆదేశాల మేరకు నిర్వహిస్తామన్నారు. విండో మొత్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఎంపీపీ శ్రీనివాసులు, జెడ్పీటీసీ శివరంజని, వైస్‌ ఎంపీపీ కోటేశ్వర్‌, కోఆప్షన్‌ మహమ్ముద్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. 


logo