శనివారం 28 మార్చి 2020
Wanaparthy - Feb 11, 2020 , 00:32:46

ప్రజల సహకారంతోనే అభివృద్ధి

ప్రజల సహకారంతోనే అభివృద్ధి

పెబ్బేరు : ప్రజల సహకారంతోనే పల్లెలు, పట్టణాల అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ కరుణశ్రీ అధ్యక్షతన ఏర్పా టు చేసిన మొదటి కౌన్సిల్‌ సాధారణ సమావేశానికి మంత్రి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్‌ యాస్మిన్‌బాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పల్లెలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్ర ణాళికాబద్ధంగా పనిచేస్తుందని తెలిపారు. మారుతు న్న కాలానికి, అవసరాలకు అనుగుణంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సం స్కరణలు తెచ్చి, అవినీతికి ఏ మాత్రం ఆస్కారం లే కుండా పౌరసేవలు త్వరితగతిన అమలయ్యేలా నూతన చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చామన్నారు. ప ట్టణ ప్రజలు శాంతియుతంగా, ప్రశాంతమైన వాతావరణంలో నివసించేలా కట్టుదిట్టమైన నిబంధనలను కొత్త చట్టంలో పొందుపరిచారని వివరించారు. పార్టీలకతీతంగా కౌన్సిల్‌ సభ్యులు అభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు. సమష్టి కృషితో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ రాష్ట్రంలోనే ప్రత్యేక గు ర్తింపు తీసుకురావాలని కోరారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులు మం జూరు చేసిందన్నారు. ఈ నిధులతో జాతీయ రహదారికి వరకు రోడ్ల విస్తరణతో పాటు డివైడర్‌, సెంటర్‌లైటింగ్‌ ఏర్పాటు, హరితహారం, శానిటినేషన్‌ తదితర అభివృద్ధి పనుల కోసం వినియోగించుకోవాలని సూ చించారు. ప్రజ లు సకాలంలో పన్నులు చెల్లించి పట్ట ణ అభివృద్ధికి తోడ్పాటునందించాల ని కోరారు. వార్డు ల్లో నెలకొన్న సమస్యలను గుర్తిస్తూ విద్యుద్దీపాలు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, పారిశుధ్యం తదితర వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. కలెక్టర్‌ యాస్మిన్‌బాషా మాట్లాడుతూ పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కా రం కోసం కౌన్సిలర్లు నిరంతరం కృషి చేయాలని సూ చించారు. పారిశుధ్య నిర్వహణ మెరుగుపరిచేందుకు చట్టంలో పలు చర్యలు పొందుపర్చినట్లు తెలిపారు. సమావేశం లో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కర్రెస్వామి, కౌన్సిలర్లు అక్క మ్మ, పద్మ, సుమతి, పార్వతి, సువర్ణ, అశ్విని, ఎల్లారెడ్డి, రామకృష్ణ, గోపి బాబు, ఎల్లస్వామి, తాసిల్దార్‌ ఘూన్సీరాం నాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ చలపతి, అధికారులు పాల్గొన్నారు. 


logo