సోమవారం 30 మార్చి 2020
Wanaparthy - Feb 10, 2020 , 00:39:25

664 నామినేషన్లు ఆమోదం

664 నామినేషన్లు ఆమోదం

వనపర్తి రూరల్‌ : ఈనెల 15న జరిగే సహకార ఎన్నికల నేపథ్యంలో ఆదివారం జిల్లాలోని సహకార సం ఘాల కార్యాలయాల్లో ఎన్నికల ప్రత్యేకఅధికారులు నా మినేషన్ల పరిశీలన పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 15 సహకార సంఘాలకు 195 డైరెక్టర్‌  స్థానాలకు  700 నామినేషన్లు వచ్చాయి. వాటిలో 9 స్థానాలకు ఒక్క నా మినేషన్‌ మాత్రమే రావడంతో అధికారులు నామినేషన్ల పత్రాలను పరిశీలించి వాటిని ఏకగ్రీవంగా సోమవారం ప్రకటించనున్నారు. 15 సహకార సంఘాలలో దాఖలైన 700 నామినేషన్లలో 36 తిస్కరించారు. 664 నామినేషన్లు సరైనవిగా అధికారులు గుర్తించారు. ఎ క్కడ ఎలాంటి పొరపాటు లేకుండా అన్నిజాగ్రత్తలు తీ సుకున్నారు. రేచింతలో 6, పెబ్బేరు 3, 10 డైరెక్టర్‌ స్థా నాలు, నాగవరంలో 1వ డైరెక్టర్‌ స్థానాలకు ఒక్కొక్క నామినేషన్లు మాత్రమే వచ్చాయి. వాటిని క్షుణంగా పరిశీలించి అప్రూవల్‌ చేశారు. దీంతో జిల్లాలో 9 స్థానాలు ఏకగ్రీవం అయ్యే అవకాశముంది. మిగతా చోట్ల ము మ్మరంగా పోటీ ఉండగా మరికొన్ని వార్డుల్లో ఒక్కరు, ఇద్దరు మాత్రమే నామినేషన్లు వేశారు. అభ్యర్థులు ఖ రారు కాకపోవడం, తిరస్కరణకు గురైన సదరు వ్యక్తిని డైరెక్టర్‌ పోటీలో ఉంచేందుకు వీలుగా ఇద్దరేసి నామినేషన్లు దాఖాలు చేసినట్లు సమాచారం.

నేడు ఉపసంహరణ

నామ పత్రాల పరిశీలన పూర్తి కావడంతో సోమవా రం అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 6 నుంచి 8వరకు స్వీకరించిన నామినేషన్‌ పత్రాలు ని బంధనల ప్రకారం ఉన్నాయా లేదా అని ఆదివారం అ ధికారులు క్షుణ్ణంగా నేమిషన్లను పరిశీలించి జాబితాను సహకార కార్యాలయాల నోటిస్‌ బోర్డులపై అతికించా రు. కొన్ని సంఘాల్లో ఏకగ్రీవం చేసేందుకు పోటీ చే స్తున్న సభ్యులతో పార్టీల నాయకులు సంప్రదింపులు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని రేచింతల, పెబ్బేరు, నాగవరం సహకార సంఘాల్లో కొన్ని డైరెక్టర్ల స్థానాలకు ఒక్క నామినేషన్‌ రావడంతో ఆ స్థానాలు ఏకగ్రీవమ య్యే అవకాశముంది. 

ఖరారు చేసిన 664 నామినేషన్లు..

రేచింతల 27కు 22, శ్రీరంగాపురంలో 44కు 43, తూంకుంటలో 48కు 46, వనపర్తిలో 38కు 38, గోపాల్‌పేట్‌లో 41కు 40, పెద్దమందడిలో 60కు 52, ఖిల్లాఘణపురంలో  59కు 59, పాన్‌గల్‌లో 53కు 50, కొ ప్పునూర్‌లో 52కు 52, ఆత్మకూర్‌లో 62కు 56, నాగవరంలో 43కు 39, రాజనగరంలో 27కు 27, రామకృష్ణపురంలో 39కు 37, కొత్తకోటలో 66కు 63, పెబ్బేరులో 41కు 40 నామినేషన్లు సరైనవిగా గుర్తించారు. ఈ జాబితాను సహకార కార్యాలయాల్లో అతికించారు. 


logo