శనివారం 28 మార్చి 2020
Wanaparthy - Feb 10, 2020 , 00:37:41

పార్టీ కార్యాలయ పరిసరాలు పచ్చగా ఉండాలి

పార్టీ కార్యాలయ పరిసరాలు పచ్చగా ఉండాలి

వనపర్తి రూరల్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం చుట్టూ ఆకుపచ్చని చెట్లు ఉండేలా వివిధ రకాలైన మొక్కలు నాటాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. ఆదివారం మండలంలోని రాజపేట గ్రామ శివారులో నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి నిరంజన్‌రెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌లతో కలిసి పరిశీలించారు. అవసరమైనంత వర్కర్లును పెట్టి పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆహ్లాదం కలిగేలా పరిసరాల్లో వివిధ రకాలైన మొక్కలను నాటించాలని తెలిపారు. ఈ ప్రాంతానికే కాకుండా జిల్లాకు ప్రామాణికంగా నిలిచేలా పనులు చేపట్టాలని సూచించారు. మంత్రి వెంట మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌, కౌన్సిలర్లు కృష్ణ, రాములు, టీఆర్‌ఎస్‌ నాయకులు తిరుమల్‌నాయుడు, మహేశ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo