మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Feb 10, 2020 , 00:35:42

ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో అవినీతి ఆరోపణలతో ముగ్గురిపై వేటు

ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో అవినీతి ఆరోపణలతో  ముగ్గురిపై వేటు

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం):  మహబూబ్‌ నగర్‌ ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో వైద్యసేవల కోసం వచ్చిన ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ వార్డు బాయ్‌లను ఉద్యోగం నుంచి తొలగిస్తూ, విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్‌ నాగరాజును సస్పెండ్‌ చేస్తూ డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి ఆదివారం  ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం మహబూబ్‌ నగర్‌ ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో  ఓ వ్యక్తిపై ఆడవిపంది దాడి చేసిన ప్రమాదంలో తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. అయితే అక్కడ విధుల్లో ఉన్న డాక్టర్‌ ఆసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ నాగరాజు విధుల్లో ఉండి పట్టించు కోకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి బాధితుడి బాధను చూడకుండా అక్కడ విధుల్లో ఉన్న ఔట్‌ సోర్సింగ్‌ వార్డు బాయ్‌లు బాలరాజు, మహేంందర్‌లు వైద్యసేవల నిమిత్తం అతనికి చాతీపై కుట్లు వేశారన్నారు. కుట్లు వేసి అనంతరం వార్డు బాయ్‌లు డబ్బులు ఇవ్వాలని బాధితుడి కుటుంబ సభ్యులను అడిగారన్నారు. వారి వద్ద  డబ్బులు లేవని చెప్పినా వినకుండా ఇవ్వాలని డిమాండ్‌ చేసి వారి నుంచి డబ్బులు తీసుకున్నారు. ఈ క్రమంలో విషయం దవాఖాన సూపరింటెండెంట్‌తో పాటు వాట్సఫ్‌ గ్రూప్‌లలో చిత్రీకరించడంతో వెంటనే దవాఖాన సూపరిం టెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌ దృష్టికి తీసుకొచ్చారన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమిక విచారణలో తెలినందున డాక్టర్‌ నాగరాజును సస్పెండ్‌ చేయాలని తెలపడంతో డీఎంఈని ఆదేశించడంతో ఉత్త ర్వులు జారీ చేశారన్నారు. అదేవిధంగా విధులను అతిక్రమించి వైద్యసేవల కోసం వచ్చిన వారి నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్డు బాయ్‌లు బాలరాజు, మహేందర్‌లను ఉద్యోగంలోంచి తొలగిస్తూ సూపరింటెండెండ్‌ డాక్టర్‌ రాంకిషన్‌ ఉత్తర్వులు జారీ చేశారన్నారు.


logo
>>>>>>