సోమవారం 06 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 10, 2020 , 00:32:50

వనపర్తి బల్దియాను అభివృద్ధి చేస్తా

వనపర్తి బల్దియాను అభివృద్ధి చేస్తా

వనపర్తి సాంస్కృతికం : వనపర్తి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తానని మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ అన్నారు. ఆదివారం వనపర్తి పట్టణంలో సాహితీకళావేదిక ఆధ్వర్యంలో స్థానిక యాదవ సంఘం భవనంలో నూతనంగా ఎన్నికైన 22 మంది టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లను సాహితీకళావేదిక సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గట్టుయాదవ్‌ మాట్లాడుతూ పా ర్టీలకు అతీతంగా కౌన్సిలర్ల సహకారంతో పట్టణంలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. మంత్రి ని రంజన్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన తెలిపారు. అలా గే పట్టణంలోని జైభీం సంస్థ సమావేశ మందిరంలో కార్యక్రమంలో ప్రముఖ కవి సందాపురం బిచ్చయ్య రచించిన అంతర్వాణి శతకమును మున్సిపల్‌ చైర్మన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కౌన్సిలర్లు, సాహితీకళావేదిక అధ్యక్షకార్యదర్శులు పలుసశంకర్‌గౌడ్‌, ఓంకార్‌, సాహితీవేత్తలు భైరోజు చంద్రశేఖర్‌, నారాయణరెడ్డి, సందాపురం బిచ్చయ్య, వేణుగోపాల్‌, పూరిసురేశ్‌శెట్టి, బండారు శ్రీనివాసులు, సత్తార్‌ పాల్గొన్నారు.logo