ఆదివారం 29 మార్చి 2020
Wanaparthy - Feb 09, 2020 , 03:07:05

పదిలో మున్ముందుకు

పదిలో మున్ముందుకు

వనపర్తి విద్యావిభాగం : రెండేళ్ల నుంచి జిల్లాలో విద్యార్థులు పదిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తున్నారు. విద్యార్థులు ఏ పరీక్షలోనైనా సమర్థవంతంగా రాయగలడగం, చదవడం, విశ్లేషించడం చేయగల సామర్థ్యాన్ని పెంపొందిస్తున్నారు. జి ల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒకే సమయానికి, ఒకే అంశంలో బోధన ఉండేలా ప్రతిరోజు ప్రత్యేకమైన టైంటేబుల్‌, షెడ్యూల్‌ను అమలుచేస్తున్నారు. యాక్షన్‌ప్లాన్‌ ఫలితాలను పరీక్షించేందుకు జిల్లా సెక్టోరియల్‌ అధికారులు చంద్రశేఖర్‌, గణేష్‌లు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఉపాధ్యాయుల లోపాలను గుర్తించి సూచనలిస్తున్నారు. ప్రతిరోజు నాలుగు సబ్జెక్టుల్లో ఒక్కో దానికి గంటన్నర చొప్పున కేటాయిస్తున్నారు. మొదటి అ రగంట ఉపాధ్యాయుడు పాఠాలను బోధిస్తున్నాడు. రెం డో అరగంట విద్యార్థులు చదవడం లేదా అధ్యయనం చే యడం, మూడో అరగంట లఘు పరీక్షల నిర్వహణ వం టివి చేస్తున్నారు. ఇలా ప్రతి సబ్జెక్టులో ఏ రోజుకారోజు అంశాన్ని చదవడం, అవగాహన చేసుకోవడం ఆ సబ్జెక్టు, టాపిక్‌పై విద్యార్థులు పూర్తి పట్టు సాధించేందుకు సాధన చేయిస్తున్నారు. ప్రతి సబ్జెక్టులో ఎప్పటికప్పుడు స్లిప్‌ టె స్ట్‌లు నిర్వహించి విద్యార్థులను సబ్జెక్టులో పరిపూర్ణత సా ధించేందుకు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులు గంటన్నరలో నేర్చుకోలేకపోయినా ఆ ప్రక్రియను ఇంటివద్ద నేర్చుకుని వచ్చేలా ఒక్కో అంశాన్ని పలుమార్లు చదివేదా ని కన్నా చూసి రాయడం ద్వారా ఎక్కువ అంశాన్ని నేర్చుకోవచ్చనే సంకల్పంతో వెనుకబడిన అంశాలను నేర్చుకునేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. 

11 నుంచి 27 వరకు ప్రీఫైనల్‌ పరీక్షలు..

జిల్లాలోని 114 పాఠశాలల్లో 4,652 మంది వి ద్యార్థులకు ఈ నెల 11 నుంచి 27వ తేదీ వరకు ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రా ష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా మార్చి మొదటి వారం లో రెండో ప్రీఫైనల్‌ నిర్వహించి ఎలాంటి ప్రశ్నలు వచ్చినా అవలీలగా రాయగల సామర్థ్యాన్ని, సమర్థతను కల్పిస్తున్నారు. ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకే ఈ పరీక్షలు దోహదపడనున్నాయి. 2017-18 అకాడమిక్‌ సంవత్సరంలో పది ఫలితాల్లో 21వ స్థానంలో నిలిచి 75 శాతం ఉత్తీర్ణత సాధించింది. రెండో ఏడాది (2018-19)లో జిల్లా 24వ స్థానంలో నిలిచినప్పటికీ 91.3 శాతం ఉత్తీర్ణత ఫలితాల ను సాధించింది. ముఖ్యంగా విద్యార్థుల్లో విషయాంశాన్ని అవగాహన చేసుకొని తామే స్వయంగా రాయగలగడం, చదవగలగడం, విశ్లేషించగల సమర్థతను యాక్షన్‌ ప్లాన్‌ ద్వారా సాధించగలుగుతున్నారు. 

దాతల సహకారం..

ఆయా సబ్జెక్టులలో సందేహాలను నివృత్తి చేసుకునేందు కు, ఎప్పటికప్పుడు అంశాలను సులభంగా నేర్చుకునేందుకు స్టడీ అవర్స్‌ను నిర్వహిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులు ఉదయం త్వరగా వచ్చి రాత్రివేళలో ఇంటికి వెళ్తుండడంతో సాయంకాలం స్నాక్స్‌ను అందించేందుకు దాతలు ముందుకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ శారద, కొంతమంది ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చులతో విద్యార్థులకు అటుకులు, పెబ్బర్లు, ఉప్మా, బిస్కెట్లు, పెసర్లు, దినుసులు వంటి వాటిని సమకూరుస్తున్నారు. 


logo