సోమవారం 30 మార్చి 2020
Wanaparthy - Feb 09, 2020 , 03:05:06

వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులకు దోహదపడతాయి

వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులకు దోహదపడతాయి

కొత్తకోట : విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అమడబాకులలో ఉన్న ఆదర్శ పాఠశాల మూడో వార్షికోత్సవాన్నికి ఆయన హాజరయ్యారు. ముందుగా పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యే ఆలకు పూలబొకేలు అందజేసి స్వాగతం పలికారు. అదేవిధంగా పాఠశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సైన్స్‌ ఫెయిర్‌, ఆర్ట్స్‌ ఎగ్జిబిట్‌లో విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను ఎమ్మెల్యే తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహాదపడతాయన్నారు. పలు అంశాల పట్ల విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని అన్నారు. విద్యార్థులు గొప్ప స్థానాలకు ఎదగాలంటే క్రమశిక్షణతో కూడిన విద్య ఎంతో అవసరమని, అలాంటి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలను అదిరోహించాలని పేర్కొన్నారు. కష్టంతో కాకుండా ఇష్టంతో విద్యార్థులు చదివినప్పుడే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. బట్టి విధానంలో కాకుండా అవగాహాన చేసుకోని చదివినప్పుడే పరీక్షలలో వచ్చే ప్రశ్నలకు సులువురు సమాధానాలు ఇవ్వగలుగుతారని అన్నారు. వచ్చె నెలలో పది, ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమవుతాయని, అందుకు విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదివితే మంచి ఉత్తీర్ణతను సాధిస్తారని చెప్పారు. అదేవిధంగా పదో తరగతి విద్యార్థులు, ఇంటర్‌ విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్‌ వామన్‌గౌడ్‌, కొత్తకోట మున్సిపల్‌ చైర్మన్‌ సుకేశిని, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్‌, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్‌, సీడీసీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ బుచ్చన్న, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, కొత్తకోట మాజీ సర్పంచ్‌ బాలనారాయణ, సీనియర్‌ నాయకులు భీంరెడ్డి, కొండరెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయల బృందం, విద్యార్థులు,  గ్రామస్తులు పాల్గొన్నారు. 


logo