గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 09, 2020 , 03:03:58

రాజపేట తాండలలో ఎక్సైజ్‌ టాస్కపోర్సు దాడులు...

రాజపేట తాండలలో ఎక్సైజ్‌ టాస్కపోర్సు దాడులు...

వనపర్తి రూరల్‌ ః మండలంలోని రాజపేట గ్రామ పంచాయితీ పరిధిలోని పాప్యగాని తాండలలో శనివారం ఎక్సైజ్‌ టాస్కపోర్సు అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా టాస్కఫోర్సు ఎస్సై వెంకట్రాములు మాట్లాడుతూ  రాజపేట పెద్దతాండ, బాలెగాని తాండ, పాప్యగాని తాండలలో దాడులు నిర్వహించిన 80 లీటర్ల బెల్లపానకం ద్వంసం చేసి, మూడవత్‌ చిట్టెమ్మ నుంచి 4 లీటర్ల సార, కాట్రావత్‌ రాములు నుంచి 2 లీటర్ల సారాను స్వాదీనపర్చుకున్నట్లు తెలిపారు. వీరిద్దరిని అరెస్టు చేశామన్నారు. ఈ దాడులలో హెడ్‌కానిస్టేబుల్‌ భగవంతు గౌడ్‌, షేక్‌ నిరంజన్‌, సిబ్బంది లక్ష్మి, మోహన్‌రెడ్డి, జనర్థన్‌రెడ్డి. దస్తాగిరిలు పాల్గొన్నారు.logo
>>>>>>