బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 09, 2020 , 02:57:47

నేడు మన్యంకొండ వెంకన్న రథోత్సవం

నేడు మన్యంకొండ వెంకన్న రథోత్సవం

బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టంగా  నిర్వహించనున్న రథోత్సవాన్ని  ఆదివారం రాత్రి రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి రథోత్సవాన్ని ప్రారంభిస్తారు.  తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన మన్యంకొండ వెంకన్న  దేవాలయంలో శనివారం కావడంతో గోవింద నామస్మరణలతో భక్తులు భారీకేడ్లలో బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు. తెలంగాణ నుండే కాకుండా ఆంధ్ర, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కోనేరులో పుణ్యస్నానం ఆచరించి కుటుంబ సమేతంగా చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు కోనేరు నుంచి గర్భగుడి వరకు బారులుగా తీరి స్వామి వారిని దర్శించుకున్నారు.  అనంతరం తమ మొక్కులు తీర్చుకునేందుకు స్వామి వారికి దాసంగాలతో మట్టి కుండలో  నైవేద్యాన్ని ఒండి స్వామి వారికి తమ పిల్లల తలపై పెట్టుకొని  మళ్లీ వచ్చే సంవత్సరం వరకు తమ కుటుంబాలు చల్లగా జీవించాలని స్వామి వారికి సమర్పిస్తారు. దాసాంగాలు స్వామిగా పేరు గాంచిన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలను తీరుస్తారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వచ్చి మొక్కులు తీర్చుకుంటామని స్వామి వారికి మొక్కుతారు. 

కుటుంబ సమేతంగా రెండు రోజుల పాటు ఎంత పని ఉన్నా రథోత్సవాన్ని కనులారా చూడాలని లక్షలాది మంది భక్తులు రథాన్ని ఒకసారి పట్టి తమ మొక్కులను తీర్చుకోవాలనే ఆశతో వేచి చూస్తారు.  స్వామి వారి భక్తుల దగ్గరికి వచ్చి ఆశీర్వదించడానికి ఈ రథోత్సవాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు అళహరి వంశీయులతో అంగరంగ వైభవంగా విద్యుత్‌ దీపాలు, వేద మంత్రాలతో, భాజా భజంత్రీలతో, కోలాటాలు, అడుగుల భజన వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో టపాకాయాలు పేలుస్తూ రథాన్ని ముందుకు సాగుతోంది. ఈ రథోత్సవానికి వచ్చే భక్తులకు  ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు సిబ్బంది దేవాలయ సిబ్బంది భక్తులకు  సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

...

- కొండపైకి వచ్చే వారికి ప్రత్యేక మిని బస్సులను ఏర్పాటు చేశారుః

మహబూబ్‌నగర్‌ నుంచి నారాయణపేట నుంచి,హైదరాబాద్‌ నుంచి వచ్చే బస్సులను మన్యంకొండ స్టేజీ దగ్గర  ప్రభుత్వ పాఠశాల మైదానంలో బస్టాండును ఏర్పాటు చేశారు.  అక్కడికి వచ్చిన భక్తులను ప్రత్యేక మినీ బస్సుల ద్వారా కొండపైకి వెళ్లడానికి సౌకర్యాలు కల్పించారు.  వికలాంగులకు, వృద్ధులకు అనువుగా ఉండేందుకు మినీ బస్సులను ఏర్పాటు చేశారు. ఆటోలను థేరు రోజు కొండపైకి అనుమతించడం లేదని, భక్తులు బస్టాండు వరకే ఆటోలను అనుమతించడం జరిగిందని, దేవాలయ ధర్మకర్త అళహరి మధుసూదన్‌కుమార్‌ పేర్కొన్నారు. 


logo