గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 07, 2020 , 00:50:27

సర్కారు మనదే.. సహకారం మనకే!

సర్కారు మనదే.. సహకారం మనకే!

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ: రానున్న సహకార ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ సత్తాచాటి ఓటమి ఎరుగని పార్టీగా నిలవాలని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కార్యకర్తలనుద్దేశించి పేర్కొన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మండల నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార సంఘం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధుతో పాటు రైతు సంక్షేమం కోసం అన్ని విధాలుగా పాటుపడిందన్నారు. రైతుల పంటలకు నీరందించేందుకు మిషన్‌ కాకతీయ పేరిట చెరువుల పునరుద్ధరణ వంటి చర్యలు చేయడమే కాకుండా రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమన్నారు. రైతుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతీ కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సహకార ఎన్నికలలో ప్రతీస్థానం టీఆర్‌ఎస్‌ కైవసం కావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కారు మనదే.. సర్కారు మనదేనంటూ సహకార ఎన్నికల్లో విజయభేరీ మోగించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, వైస్‌ ఎంపీపీ కోటేశ్వర్‌, కోఆప్షన్‌ మహమ్ముద్‌, మాజీ పీఏసీఎస్‌ అద్యక్షుడు గాడి కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్‌, అద్యక్షుడు రవికుమార్‌యాదవ్‌, నాయకలు  పురం సుదర్శన్‌రెడ్డి, వెంకటనర్సింహారావు, వీరేశలింగం, అనిల్‌గౌడ్‌, సిరాజ్‌అహ్మద్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, మశ్చందర్‌గౌడ్‌, గోపాల్‌యాదవ్‌ పాల్గొన్నారు. 


logo
>>>>>>