శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 07, 2020 , 00:49:01

నామినేషన్ల ప్రక్రియలో పాల్గొన్న మంత్రి నిరంజన్‌రెడ్డి

నామినేషన్ల ప్రక్రియలో పాల్గొన్న మంత్రి నిరంజన్‌రెడ్డి
  • ప్రారంభమైన సహకార ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
  • కొత్తకోట పీఏసీఎస్‌ పరధిలో 11, రామకృష్ణాపురం పీఏసీఎస్‌ పరిధిలో 6 నామినేషన్లు దాఖలు

కొత్తకోట : సహకార నామినేషన్ల ప్రక్రియ గురు వారం ప్రారంభమైంది. రామకృష్ణాపురం పీఏసీ ఎస్‌ నామినేషన్ల ప్రక్రియలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. కొత్తకోట పీఏసీఎస్‌, రామకృష్ణాపురం పీఏసీఎస్‌ పరిధిలో మొత్తం 17 నామినేషన్లు మొదటి రోజు దాఖలయ్యాయి. కొత్తకోట పీఏసీఎస్‌ పరిధిలో 11 నామినేషన్లు వచ్చాయి. అందులో అత్యధికంగా 1వ వార్డుకు 6 నామినేషన్లు రాగా,  2వ వార్డుకు రెండు నామినేషన్లు, 4వ వార్డు, 9వ వార్డు, 12 వార్డుకు ఒక్కొక్క నామినేషన్‌ దాఖలయ్యాయి. రామకృష్ణాపురం పీఏసీఎస్‌ పరిధిలో మొత్తం 6 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 3వ వా ర్డు నుంచి ఒకటి, 7వ వార్డు నుంచి రెండు, 8, 9,10 వార్డులలో ఒక్కొక్క నామినేషన్‌ దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ ఇంకా రెండు రోజుల ఉండడంతో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థి వాసుదేవారెడ్డి 10వ వార్డుకు మం త్రి సమక్షంలో నామినేషన్‌ దాఖలు చేశారు. 


మల్లికార్జునస్వామిని దర్శించుకున్న మంత్రి

సహకార ఎన్నికల్లో భాగంగా రామకృష్ణాపురం గ్రామంలోని రామేశ్వర ఆలయాన్ని మంత్రి సందర్శించి మల్లికార్జునస్వామికి పూజలు చేశారు. అనంతరం స్థానిక నాయకులు గ్రామంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రామేశ్వర చెరువు లిప్ట్‌ సమస్యను ప్రస్తావించగా, ఎత్తిపోతలకు వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వానాకాలం నాటికి నీరందేలా చూడాలని అధికారులకు సూచించా రు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. మంత్రితో పాటు స్థానిక సర్పంచ్‌ శారద లక్ష్మీరెడ్డి, కో-ఆప్షన్‌ మెం బర్లు అల్లబాషా, ఉమా మహేశ్వర్‌రెడ్డి ఉన్నారు. 


logo