బుధవారం 01 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 07, 2020 , 00:46:27

బాల్యవివాహాలు నియంత్రించాలి

బాల్యవివాహాలు నియంత్రించాలి

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : బాల్యవివాహాలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జెడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కార్యాలయంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలల పరిరక్షణ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గ్రామ స్థాయిలో బాల్యవివాహాలు అరికట్టేలా సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. 18 ఏండ్లు పైబడిన యువతుల వివాహాలకు కళ్యాణలక్ష్మి వర్తిస్తుందన్నారు. బాల్యవివాహాలకు కళ్యాణలక్ష్మి ఆర్థికసాయం రాదన్నారు. దీనిపై గ్రామీణ స్థాయిలో అంగన్‌వాడీలు అందరిని చైతన్య పర్చాలన్నారు. బడి మానేసిన పిల్లలను బడిలో చేర్పించే విధంగా తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యతను కమిటీ తీసుకోవాలన్నారు. బాలబాలికల హక్కులను పరిరక్షించేలా తొందరలో జిల్లాస్థాయిలో ఓ అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆ యన చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ బంగారు శ్రీనివాసు లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాయిత్రియాదవ్‌, కోఆప్షన్‌ సభ్యు డు మహమూద్‌, రైతు సమన్వయ స మితి నాయకులు వీరేశలింగం, ఎంపీడీవో క్రిష్ణయ్య, సీడీపీవో శ్రావణి, సూపర్‌వైజర్‌ భారతి పాల్గొన్నారు. 


అమరచింతలో కేజీబీవీ భవనం ప్రారంభం

స్వరాష్ట్రంలోనే ప్రభుత్వ విద్య బలోపేతమయ్యిందని జెడ్పీచైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం అమరచింతలో నూతనంగా నిర్మించిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం భవనాన్ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద బాలబాలికలు ఉన్నత విద్యనభ్యసించాలనే సదుద్దేశంతో కస్తూరిబాగాంధీ విద్యాలయాలను విరివిగా ఏర్పాటు చేసిందన్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా విద్యాలయాలు, గురుకులాలు పేదింటి విద్యాకుసుమాలకు దేవాలయాలుగా మారాయన్నారు. మండలంలోని పాంరెడ్డి శివారులో నూతన భవనం రూ. 2.70 లక్షలతో నిర్మించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సుశీందర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మాలతి, జడ్పీటీసీ సరోజ, టీఆర్‌ఎస్‌వీ అద్యక్షుడు నరేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>