బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 06, 2020 , 02:45:16

11 గ్రామాలు 19 లిప్టులు

11 గ్రామాలు 19 లిప్టులు
  • కరువు నేలలో కృష్ణమ్మ గలగలలు
  • పెద్దమందడిలో ఏకంగా 19 మినీ లిప్టులు
  • అదనంగా 4 వేల ఎకరాల్లో సాగుబడులు
  • మిగతా మండలాల్లోనూ ఏర్పాటవుతున్న పంపులు
  • చొరవ తీసుకున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
  • హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మండలంలో నాలుగైదు లిఫ్టులుండడం పరిపాటి.. కానీ ఏకంగా ఒక్క మండలంలోనే 19 లిఫ్టులు ఏర్పాటు చేసి ఎత్తుపొలాలకు నీరందిస్తున్నారు.. పెద్దమందడి బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. 22 గ్రామపంచాయతీలు ఉండగా దాదాపుగా అన్ని గ్రామాలకు కాలువ నీళ్లు అందుతున్నాయి.. అయితే, ఎత్తుపొలాలకు నీరందడంలేదనే ఉద్దేశంతో 11 గ్రామాల్లో 19 లిఫ్టులను ఏర్పాటు చేశారు.. చెరువుల నుంచి మోటర్లను ఏర్పాటు చేసి నీటిని పారిస్తున్నారు.. దీంతో అదనంగా నాలుగు వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి.. గతంలో కరువు నేలగా పేరుగాంచిన పెద్దమందడిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆలోచనతో నేడు కృష్ణమ్మ గలగలా పారుతున్నది.. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..


జిల్లాలో ని పెద్దమందడి మండలం అభివృద్ధిలో వెనుకబడింది. మండలంలోని 22 పంచాయతీలు, 39 వే ల జనాభా, 13 వేల మంది రైతులు, 20 వేల ఎకరాల సాగుభూములు పెద్దమందడి మండలంలో ఉన్నాయి. మండలంలోని గ్రా మాల్లో వ్యవసాయ సాగు విస్తరిస్తోంది. గతంలో మండ లం ఎడారిని తలపించేది. అన్నమోరామచంద్రా అంటూ మండల పరిధిలోని రైతులు, కూలీలు దశాబ్దాల తరబడి పట్నం బాట పట్టిన సందర్భాలున్నాయి. 


రెండేళ్లుగా పెను మార్పులు..

కరువుకు నిలయమైన పెద్దమందడి మండలానికి సాగునీటి పరంగా రెండేళ్లుగా పెను మార్పులొచ్చాయి. బుద్దారం చెరువు ఎడమ కాలు వ ద్వారా పెద్దమందడి బ్రాంచ్‌ కెనాల్‌కు ఏర్పాటు చేయడంతో మండల రైతులకు మంచిరోజులు వచ్చా యి. ఈ కెనాల్‌ ద్వారా జంగమాయిపల్లి, బలిజప ల్లి, పామిరెడ్డిపల్లి, దొడగుంటపల్లి, వీరాయిపల్లి, చిన్నమందడి, అల్వాల, మంగంపల్లి, పెద్దమందడి, మద్ధిగట్ల, అమ్మపల్లి, వెల్టూరు గ్రామాలకు సాగునీటి సమస్య తీరింది. మండలంలోని మోజర్లకు మాత్రమే నీరు అందడం లేదు. ఈ గ్రామానికి శంకరసముద్రం కుడి కాలువ ద్వారా సాగునీ రు అందే అవకాశముంది. కానాయిపల్లి గ్రామం ఖాళీ చేసి కుడి కాలువకు నీటి విడుదల జరిగితే ఈ గ్రామానికి పుష్కలంగా నీరందే అవకాశముంది. 


19 లిప్టుల ఏర్పాటు..

పెద్దమందడి మండలంలో కాలువల ద్వారా సాగునీటి వసతులున్నాయి. అయితే, 11 గ్రామాల్లోని ఎత్తు ప్రాంతాల్లోని పొలాలకు నీరందడంలేదు. ఈ విషయాన్ని రైతులు మంత్రి సింగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఆదేశాలతో 11 గ్రామాల్లో 19 మినీ లిప్టులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క లిప్టు రెండు కి.మీ. వరకు ఏర్పాటు చేశారు. ఒక లిప్టులో అవసరాన్ని బట్టి ఒకటి నుంచి రెండు మోటర్లను బిగించారు. మోటర్లు, పైపులైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు సైతం చకాచకా జరిగి నేడు లిప్టుల ద్వారా రైతులు సంతోశంగా పంటలను పండిస్తున్నారు. ఇటు కాలవల నీళ్లు, అటు లిప్టుల నీళ్ల గల..గలలు పెద్దమందడిలో ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. లిప్టుల ద్వారా దాదాపు 4 వేల ఎకరాల వరకు అదనంగా సాగులోకి వచ్చింది. ఎప్పుడు కాలువల నీరు రాదనుకున్న ప్రాంతానికి నీటి వసతి కలుగడంతో రైతుల్లో పట్టరాని ఆనందం నిండుకుంది. 


మంత్రి సింగిరెడ్డి చొరవతోనే..

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చొరవతోనే పెద్దమందడి మండలంలో సాగునీటి మార్పులకు బీజం పడింది. ఒక్క పెద్దమందడి మండలమే కాదు.. నియోజకవర్గంలోని ఇత ర మండలాల్లోనూ ఎత్తైన ప్రాంతాలకు లిప్టులు పె ట్టే పనులకు మంత్రి సింగిరెడ్డి శ్రీకారం చుట్టారు. మంత్రి చొరవతో మోటర్లు, పైపులైన్లు ఏర్పాటు చేస్తుండగా, ట్రాన్స్‌ఫార్మర్‌ను రైతులు సమకూర్చుకుంటున్నారు. ఒక్క లిప్టుకు దాదాపు 8 నుంచి 10 లక్షల వరకు ఖర్చవుతుంది. ఒక్కొక్క లిప్టు నుంచి 80 -150 ఎకరాలకు పైగా సాగులోకి వస్తుంది. ఎత్తైన ప్రాంతాలకు సైతం సాగునీటి వసతుల కల్పనలపై మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే ఆయా ప్రాంతాలకు సాగునీరందుతున్నది.


లిప్టులు ఏర్పాటు చేసిన గ్రామాలు

పామిరెడ్డిపల్లిలో 4, అల్వాల్‌లో 3, వీరాయిపల్లిలో 2, గట్లఖానాపురం, పెద్దమందడిలలో 2, అమ్మపల్లి, అనకాయిపల్లితండా, బలిజపల్లి, జంగమాయిపల్లి, చిన్నమందడి, గౌరయ్యకుంటతండాలలో ఒకటి చొప్పున 19 లిఫ్టులు ఏర్పాటు చేశారు.


మంత్రి చొరవతో భూములు సాగులోకి..

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కృషి వల్లే మా గ్రామంలో ఎత్తు ప్రాంతంలో ఉన్న పొలాలకు సాగునీరు వస్తుంది. గతంలో సాగునీరు లేక పంటలు వేసుకోలేదు. మా గ్రామానికి వచ్చినప్పుడు ఆయనకు సమస్యను వివరించాము. వెంటనే స్పందించి మోటర్లను ఏర్పాటు చేయించడంతో మా పొలాలు సాగులోకి వచ్చాయి. ఆయన దయ వేరుశనగ, యాసంగిలో వరిసాగు చేశాను.

- రాందాస్‌, రైతు, అనకాయపల్లి తండా


నిరంజన్‌రెడ్డి మేలు ఎప్పటికీ మరువం

మా పొలాలకు సాగునీరు వస్తాయో రావో అనుకున్నాం. కేవలం చెరువు కింద మాత్రమే సాగు చేస్తుంటే మేమంతా దిగులుపడ్డాం. మాకు కూడా మోటర్లు, పైపులను ఏర్పాటు చేసి సాగునీరు అందించారు. బీడు భూములను కూడా సాగులోకి తెచ్చిన ఘనత మంత్రి నిరంజన్‌రెడ్డి సార్‌ది. ఆయన చేసిన మేలును ఎన్నటికీ మరువలేం. 

- రైతు మల్లయ్య, పామిరెడ్డిపల్లి


logo