శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 06, 2020 , 02:42:17

‘పల్లెప్రగతి’ పక్కాగా ఉండాలి

‘పల్లెప్రగతి’ పక్కాగా ఉండాలి

రేవల్లి : పల్లెప్రగతి పనులు పారదర్శకంగా ఉండాలని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తుందని రాష్ట్ర కమర్శియల్‌ టాక్స్‌కమీషనర్‌, పల్లెప్రగతి మండల ఫ్లయింగ్‌స్కాడ్‌ అధికారిని నితుప్రసాద్‌ అన్నారు. బుధవారం ఆమె మండలంలోని చెన్నారం, నాగపూర్‌ కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషాతో కలిసి గ్రామాల్లో  పల్లెప్రగతి పనులపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అంతకముందు చెన్నారం గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని పారిశుధ్యం, డంపింగ్‌యార్డు, మురుగు కాలువల నిర్వహణపై సర్పంచ్‌ రమేశ్‌కు పలు సూచనలు చేశారు. డంపింగ్‌ యార్డు గ్రామానికి, పాఠశాలను అతిసమీపంలో ఉందని అభ్యంతరం చెప్పారు. గ్రామంలో ప్లాస్టిక్‌ వస్తువల నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతనం కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా, మండల ఫ్లయింగ్‌స్కాడ్‌ అధికారిని నితుప్రసాద్‌లను శాలువతో సత్కరించారు. 


నాగపూర్‌ గ్రామంలో ఓఇంటిలో నుంచి మురుగు నీరు బయటికి వస్తుండడంతో గమనించిన ఫ్లయింగ్‌స్కాడ్‌ అధికారిని నితుప్రసాద్‌ ఇలా రోడ్డుపైకి మురుగు నీరు రాకుండ చూడాలని, జరిమానాలు విధించాలని సర్పంచ్‌ జ్యోతిశ్రీనివాస్‌రెడ్డికి తెలిపారు. గ్రామాల్లో ఖాళీ ప్రదేశాల్లో చెత్తచెదారాన్ని తొలగించాలని, భగీరథ లీకేజీలకు మరమ్మతు చేయాలని పలు మౌలిక వసతులపై గ్రామస్థాయి అధికారులకు ఆదేశించారు. ప్రతిఇంటికి ఇంకుడు గుంతలను నిర్మించుకునేలా గ్రామస్తులను చైతన్యం చేయాలని ఆమె కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషాలు సర్పంచ్‌, డీఆర్‌డీవో పీడీ గణేశ్‌ను సూచించారు. గ్రామం వెలుపల ఉన్న నర్సరీని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. నర్సరీ చుట్టూ ప్రహరీగా వివిధ రకాలమొక్కలను నాటాలని ఆమె అధికారులకు చెప్పారు. కార్యక్రమంలో జిల్లాప్రత్యేక అధికారి సంతోశ్‌, జెడ్పీసీవో నర్సింహులు, డీపీవో రాజేశ్వరి, ఎంపీపీ బంకళసేనాపతి, ఎంపీడీవో శ్రీపాద్‌, తదితరులు పాల్గొన్నారు.


logo