మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Feb 06, 2020 , 02:36:15

నేటి నుంచి నామినేషన్లు

నేటి నుంచి నామినేషన్లు

వనపర్తి రూరల్‌ : జిల్లాలో 15 సహకార సంఘాల పరిధిలోని మొత్తం 195 డైరెక్టర్ల పదవుల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈనెల 2న జిల్లా సహకార ఎన్నికల అథారిటీ ఎన్నికల నోటిఫిజారీ చేసింది. దీంతో అధికారులు నామినేషన్ల పక్రియ ఏర్పాట్లు పూర్తిచేశారు. 


నామినేషన్‌ ఫీజు వివరాలు

సహకార సంఘం డైరెక్టర్‌గా పోటీ చేసే అభ్యర్థులు రిజర్వేషన్‌ ప్రకారం నామినేషన్‌ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. నామినేషన్‌ ఫీజు కింద అభ్యర్థుల రిజర్వేషన్‌ ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రూ. 500, బీసీలకు రూ.750, జనరల్‌కు రూ.1000గా నిర్ణయించడం జరిగింది.


6వ తేదీ నుంచి 8 వరకు..

6 నుంచి 8వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఆయా సహకార సంఘాల కార్యాలయాల్లోనే స్వీకరిస్తారు నామినేషన్ల ప్రక్రియ పూర్తి అనంతరం 9వ తేదీన అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు. 10వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అధికారులు తుది జాబితాను ప్రకటించి, గుర్తులు కేటాయిస్తారు. 15వ తేదీ ఉదయం 7 గంటలకు నుంచి మధ్యాహ్నం వరకు ఓటింగ్‌ నిర్వహించి, తరువాత ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటిస్తారు. పోటీ చేసే అభ్యర్థుల ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో విజేతను ఎంపికచేస్తారు. ఒక డైరెక్టర్‌ ఎన్నికకు ఒక్కొ పోలింగ్‌ బూత్‌ చొప్పున జిల్లాలో మొత్తం 195 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఒక్కొపోలింగ్‌ కేంద్రంలో ముగ్గురు ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. ప్రతి సహకార సంఘంలో 13 డైరెక్టర్లు పదవులు ఉండగా రెండు మహిళలకు (1 ఎస్సీ, 1 ఓసీ), రెండు బీసీలకు ఒకటి ఎస్సీ, ఎస్టీలకు ఏడు జనరల్‌ వర్గాలకు రిజర్వు చేశారు. దీంతో జిల్లాలోని 195 డైరెక్టర్‌ పదువులో మహిళలకు 25, బీసీలకు 30, ఎస్సీ, ఎస్టీలకు 30, ఓపెన్‌ క్యాటగిరిలో 110 అవకాశం కల్పించారు.


అభ్యర్థుల నియమ నిబంధనలు..

నిర్ధేషించిన ఫారం-2లో అభ్యర్థిత్వానికి నామినేషన్‌ చేయాలి. l ఒక అభ్యర్థి రెండు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయవచ్చు. l సంఘంలోని ఏదేని నియోజకవర్గం వార్డు ఓటర్ల జాబితాలో ఎవరి పేరు చేర్చబడినదో ఆ వ్యక్తి నియోజకవర్గపు అభ్యర్థిగా ఉండవచ్చు. 

ఆ నియోజకవర్గపు ఓటర్ల జాబితాలో ఉన్న వ్యక్తులు మాత్రమే ప్రతిపాదకుడు, బలపరిచే వ్యక్తిగా ఉండాలి.

సెలవుదినం కాని రోజున నామినేషన్లు స్వీకరిస్తారు. l ఎన్నికల అధికారి నామినేషన్‌ పత్రమును స్వీకరించి, ఫారం-3 జతచేసి ఉన్న ముట్టినట్లు తెలియజేసే పత్రమును విడదీసి ఇవ్వాలి. 

నామినేషన్‌ పత్రము స్వీకరించబడిన క్రమసంఖ్య, తేది, సమయం రాసి వెంటనే నామినేషన్‌ పత్రాలు ముట్టినట్లు రాతపూర్వకమైన రసీదుపై సంఘం యొక్క ముద్ర కూడా వేసి అధికారికి ఇవ్వాలి. l నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసిన పిదప ఎన్నికల అధికారి ఫారం-3 లో అతనికి అందిన నామినేషన్ల పట్టికను తయారు చేసి సంఘం నోటిసు బోర్డుపై ప్రదర్శించాలి.  l అటెస్ట్‌ చేసిన ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీ  l స్టాంపు సైజు కలర్‌ ఫోటోలు 3 l బ్యాంకు అకౌంటు జిరాక్స్‌ l కుల ధ్రువీకరణ పత్రం (ఒరిజనల్‌) l ఇద్దరు ప్రతిపాదకుల ఆధార్‌ కార్డుల జిరాక్స్‌లు  l ప్రతిపాదకుల ఓటర్‌ లిస్టు కాపీలు l పోటీదారు ఓటరు లిస్టు కాపీ


logo
>>>>>>