గురువారం 09 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 05, 2020 , 00:40:56

కారుకే సహకారం!

కారుకే సహకారం!
  • ఏకపక్ష నిర్ణయం తీసుకోనున్న రైతులు
  • టీఆర్‌ఎస్‌తోనే విండోల అభివృద్ధి సాధ్యమనే చర్చ
  • ప్రభుత్వ పథకాలే నిదర్శనమంటున్న కర్షకులు
  • బరిలో దింపేందుకు మొదలైన సన్నాహాలు
  • కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మంత్రి సింగిరెడ్డి

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎన్నికలు ఏవై నా గెలుపు గులాబీ పార్టీదే అన్నది రాష్ట్రంలో ప్రజలు నిర్ణయిస్తు వస్తున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్న వరుస ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయ బావుటా ఎగురవేస్తున్నది. తాజాగా సహకార ఎన్నికలకు నోటిఫికేష న్‌ విడుదల కావడంతో గులాబీ దళం చూపంతా సహకారం విజయం వైపు చూస్తున్నది. జిల్లాలోని 15 సహకార సంఘాల్లో టీఆర్‌ఎస్‌ విజయబేరి మో గించి సత్తా చాటుకోవాలని పట్టుదలతో ఉన్నారు. రే పటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతు న్న క్రమంలో సరియైన అనుచరులను ఎన్నికల రం గంలోకి దింపాలన్న లక్ష్యంతో సన్నద్ధమవుతున్నది.


వరుసగా విజయాలే..

అసెంబ్లీ ఎన్నికలు మొదలు ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల వరకు జిల్లాలో టీఆర్‌ఎస్‌ విజయాలను మూటగట్టుకున్నది. మున్సిపల్‌ ఎన్నికల్లోను ఐదు కేంద్రా ల్లో గులాబీ జెండాను ఎగురవేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆలవెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రా మోహన్‌రెడ్డిలు మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రణాళికతో ముందుకు వెళ్లారు. కొన్ని వార్డుల్లో ఫలితాలు అటు.. ఇటు అయినా జిల్లాలో అన్ని మున్సిపల్‌ చై ర్మన్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ ఖాతాలో వేసుకోగలిగింది.


కార్యకర్తలకు దిశా.. నిర్దేశం..

సహకార ఎన్నికల్లోను విజయం మన ఖాతాలోకి రా వాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి కార్యకర్తలకు దిశా.. నిర్దేశం చేశారు. ఇటీవల పార్టీ ముఖ్యుల సమావేశం నిర్వహించి ఈమేరకు తగు సూచనలు చేశారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోను టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇప్పుడు కూడా వనపర్తి నియోజకవర్గంలోని రాజనగరం, నాగవరం, వనపర్తి సొసైటీలతోపాటు జిల్లాలోని మిగితా 12 సొ సైటీల్లోను టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలుపొందాలని కూ డా కార్యకర్తలకు మంత్రి వివరించారు. ఎక్కడా ఎలా ంటి తేడాలు లేకుండా పార్టీ అనుసరించిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని మంత్రి ముఖ్య కార్యకర్తల సమావేశంలో చెప్పారు. ఇంకాను జిల్లాలోని మిగిలిన  సొసైటీల్లో ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామోహన్‌రెడ్డిలు సహకార ఎన్నికల్లో విజయాలకు అనుకూలంగా అడుగులు వేస్తున్నారు.


195 వార్డులుంటే..

జిల్లాలో 15 సహకార సంఘాలుంటే, వీటిలో 195 వార్డులున్నాయి. ప్రతి సొసైటీలో 13 వార్డులను ఏర్పాటు చేశారు. వీటిలో ఆయా కేటగిరిల వారీగా రిజర్వేషన్లు కూడా వెల్లడయ్యాయి. రెండు రోజులుగా ఆయా వార్డుల్లో రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల వేటను మొదలు పెట్టారు. జిల్లాలో నా లుగు నియోజకవర్గాలకు  చెందిన సొసైటీలున్నాయి. వీటిలో కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి పాన్‌గల్‌, తూంకుంట, కొప్పునూరు, దేవరకద్ర నుంచి కొత్తకోట, రామక్రిష్ణాపురం, మక్తల్‌ నుంచి ఆత్మకూరు, రేచింతల సొసైటీలుంటే, వనపర్తి నియోజవకవర్గం నుంచి రాజనగరం, నాగవరం, శ్రీరంగాపురం, పెద్దమందడి, ఖిల్లాఘణపురం, గోపాల్‌పేట, పెబ్బేరు, వనపర్తి సొసైటీలు ఉన్నాయి. నాలుగు తాలూకాల పరిధిలో ఉన్న ఈ సొసైటీల్లో సరియైన అభ్యర్థులను డైరెక్టర్లుగా ఎంపిక చేసేందుకు కసరత్తు మొదలైంది. 


రేపటి నుంచి నామినేషన్లు షురూ

ఇటీవల సహకార ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం అందుకనుగుణంగా కార్యాచరణ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈనెల 3న ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఓటరు జాబితాలు, రిజర్వేషన్ల వివరాలను వెల్లడించిన సంగతి విధితమే. అయితే, గురువారం నుంచి మూడు రోజుల పాటు డైరెక్టర్‌ అభ్యర్థుల నామినేషన్లకు గడువు ఇచ్చారు. దీంతో సహకార సమరంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ నామినేషన్ల దాఖలుకు  సమాయత్తమవుతున్నారు. ఆయా రిజర్వేషన్లను అనుసరించి అభ్యర్థుల వేటను ప్రారంభించిన నాయకులు గెలుపునకు దగ్గరగా ఉండే అభ్యర్థులను పరిశీలన చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సహకార సమరంలో పార్టీ గుర్తులు లేకపోవడం వల్ల ఎలాంటి తప్పిదాలు జరుగకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు.


logo