ఆదివారం 24 మే 2020
Wanaparthy - Feb 05, 2020 , 00:37:50

నంబర్‌వన్‌గా నిలపాలి

నంబర్‌వన్‌గా నిలపాలి

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : భవిష్యత్‌లో వనపర్తి మున్సిపాలిటీ అభివృద్ధి లో నంబర్‌వన్‌గా నిలిచి అవా ర్డు పొందే దిశగా కౌన్సిలర్లు పని చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవా రం జిల్లా కేంద్రంలోని తరుణి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కౌన్సిల్‌ సాధారణ సమావేశానికి మంత్రి సింగిరెడ్డి, కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ నూతన కౌన్సిలర్లు హేతుబద్దంగా, నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. వనపర్తి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు కౌన్సిలర్లు ప్రజలను చైతన్యవంతులు చేయాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అం దంగా తీర్చిదిద్ది.., మహిళలు, యువతకు ఉపాధి కల్పించడంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రజలకు సమర్థవంతంగా సేవలందించేందుకు ముం దుగా కౌన్సిలర్లకు శిక్షణ ఇవ్వాలని, ఇందులో పట్టణ అభివృద్ధిని ఆకాంక్షించే వారందరినీ భాగస్వాములను చేసి కొత్త మున్సిపల్‌ చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. పట్టణ ప్రగతిని త్వరలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు. ముందుగానే కౌన్సి ల్‌ సమాయత్తం కావాలని, రాబోయే ఐదేళ్లలో మున్సిపాలిటీ ద్వారా చేపట్టబోయే పనులపై ప్రణాళికబద్ధమైన దృక్పథాన్ని కలిగి ఉండాలన్నా రు. 


కేంద్ర ప్రభుత్వ సహకారంతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నామన్నారు. విద్యుత్‌ సమస్యలేకుండా పట్టణం నలువైపులా నాలుగు విద్యుత్‌ సబ్‌స్టేషన్లు నెలకొల్పనున్నట్లు చెప్పారు. రహదారుల విస్తరణలో భా గంగా సిరిసిల్ల మాదిరిగానే అక్కడి అనుభవాలను ఉపయోగించి ఎవరికి ఇబ్బంది కలుగకుండా చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్‌కు మంత్రి విజ్ఞప్తి చేశారు. కౌన్సిలర్లు ప్లాస్టిక్‌ నిషేధంపై నిరంతరం దృష్టి సారించి మహాయజ్ఞంలా ముందుకు తీసుకెళ్లాలన్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృ హాలను సందర్శించి పిల్లల బాగోగులను చూసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అందించేలా కృషి చేయాలని కోరారు. కౌన్సిల్‌ నిర్వహణలో ఇతరు లు వేలెత్తి చూపని రీతిలో మున్సిపల్‌ పాలన సాగాలని ఆకాంక్షించారు.


అభివృద్ధికి చేయూతనిస్తాం : కలెక్టర్‌

మున్సిపల్‌ అభివృద్ధికి చేయూతనిస్తామని కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. కొత్త మున్సిపల్‌ చ ట్టం ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలందించాలో తెలుసుకోవడంతోపాటు విధులు, బాధ్యతలు దానికి తగ్గట్టుగా పనులు నిర్వర్తింపజేయాలన్నా రు. మున్సిపల్‌ కౌన్సిల్‌ సహకారంతో పెండింగ్‌ పనులను పూర్తి చేస్తామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో వనపర్తి మున్సిపల్‌ను అభివృద్ధి చేసేందుకు కౌన్సిల్‌ కృషి చేయాలని చెప్పారు. మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌ మాట్లాడుతూ వనపర్తిని సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దడంతోపాటు అవినీతి రహితంగా తీర్చదిద్దడంలో ప్రతి కౌన్సిలర్‌ తన మనస్సు మీద ప్రమాణం చేసుకోవాలన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో శక్తివంచన లేకుండా కౌన్సిల్‌ పని చేస్తుందని చెప్పారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌ వందన సమర్పణ చేశారు. సమావేశంలో ముందుగా వ్య వసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, కలెక్టర్‌లను కౌన్సిలర్లు సన్మానించారు. కౌన్సిలర్లను మంత్రి, చైర్మన్లు సన్మానించారు. సమావేశంలో కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.


logo