బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 04, 2020 , 00:00:58

విండో ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టండి

 విండో ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టండి

వనపర్తి, నమస్తే తెలంగాణ : త్వరలో జరుగనున్న సహకార ఎన్నికల్లో నాయకులందరూ ఐకమత్యంతో కలిసి పనిచేస్తే విజయం టీఆర్‌ఎస్‌దేనని వ్యవసాయ శా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవా రం జిల్లా కేంద్రంలోని మంత్రి నివాస గృహంలో సహకార ఎన్నికలపై నాయకులకు మంత్రి దిశానిర్దేశం చేశా రు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడు తూ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపు ఉండి ఏకపక్షంగా తీర్పు ఇవ్వడం జరిగిందని, స హకార ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టడం ఖాయమన్నారు. ఎన్నికల్లో బలపరిచిన అభ్యర్థుల గెలుపుకోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కలిసి పనిచేయాలని సూచించారు. రాబోయే నాలుగేళ్లలో సహకార వ్యవస్థ స్వరూపం మారబోతుందని, రాష్ట్రంలో 59 లక్షల మంది రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన వారై ఉన్నారన్నారు. రైతుల కోసం పెట్టిన సం ఘాలలో వారి పాత్ర లేకపోవడం సహకార సంఘాల వ్యవస్థకు మంచిది కాదని వివరించారు. రైతులంతా సహకార సంఘాల్లో సభ్యులుగా మారాలని, సహకార వ్యవస్థ బలోపేతమైతేనే సామాన్యులకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. 59 లక్షల మంది రైతులు ఉ న్నా.., సహకార సంఘాల్లో 17 లక్షల మంది మాత్రమే సభ్యులుగా ఉన్నారని, త్వరలోనే ఈ సంఖ్య రెట్టింపు కావాలని సూచించారు. సహకార డైరెక్టర్ల ఎంపికలో నాయకులు కీలకంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చై ర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల పక్షపాతి

పెబ్బేరు : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పాలనను కొనసాగిస్తుందని, సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం అని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. సహకా ర ఎన్నికల్లో భాగంగా పెబ్బేరు, శ్రీరంగాపూర్‌ టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు వనం రాములు, బీరం రాజశేఖర్‌ రెడ్డిల ఆధ్వర్యంలో సోమవారం పీజేపీ గెస్ట్‌హౌజ్‌ లో పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చే శారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మం త్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల మాదిరిగానే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌కు విజయాన్ని అందించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల ప్రయోజనాల కోసం అ నేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. ప్ర తి ఎకరాకూ సాగునీరు అందించాలనే లక్ష్యంగా గోదావరి, కృష్ణా నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకుని తెలంగాణను సస్యశ్యామలం చేయాలని సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని చెప్పారు. మిషన్‌ కాకతీ య, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన, వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్‌, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు వంటివి అందించి రైతులు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ సమన్వ యంతో పనిచేయాలని సూచించారు. అన్ని వార్డులను కైవసం చేసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీపీలు శైలజ, గాయత్రి, జెడ్పీటీసీ పద్మ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కరుణశ్రీ, వైస్‌ చైర్మన్‌ మేకల కర్రెస్వామి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బుచ్చారెడ్డి, ప్రజా ప్ర తినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


logo