శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 03, 2020 , 23:55:53

రాజకీయం లేకుండా ప్రజలకు సేవ చేయాలి

రాజకీయం లేకుండా ప్రజలకు సేవ చేయాలి

కొత్తకోట : రాజకీయాలు మానుకొని ప్రజలకు సేవ చేస్తూ పట్టణ అభివృద్ధిని సాధించుకోవాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచిచారు. సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ సమావేశ మందిరంలో కొత్తకోట మున్సిపల్‌ పాలకవర్గాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజలకు సేవ చేయాలన్నారు. కౌన్సిలర్‌ దృష్టికి తెచ్చిన సమస్యలను స్టేట్‌మెంట్‌గా తయారు చేసి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పల్లెప్రగతి మాదిరిగా పట్టణ ప్రగతిని త్వరలో చేపట్టనున్నట్లు వివరించారు. రోడ్లను శుభ్రపరిచే యంత్రాన్ని మంజూరు చేసేందుకు కృషి చేస్తామనన్నారు. సీఎం కుర్చీపై కేసీఆర్‌ ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. పట్టణంలోని పేదలకు త్వరలో 500 డబుల్‌ బెడ్‌రూంలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. దానికి సంబంధించి కార్యచరణ జరుగుతుందన్నారు. సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, ఎంపీపీ గుంతమౌనిక, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సుకేశిని, వైస్‌ చైర్‌పర్సన్‌ జయమ్మ, వైస్‌ ఎంపీపీ శ్రీను, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్‌, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్‌, సీడీసీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీడీవో కతలప్ప, తాసిల్దార్‌ రమేశ్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


logo