మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Feb 03, 2020 , 23:55:18

అగ్గి తెగులు నివారణలో జాగ్రత్తలు పాటించాలి

అగ్గి తెగులు నివారణలో జాగ్రత్తలు పాటించాలి

పెద్దమందడి : రైతులు సాగు చేసిన వరి పంటకు సోకే అగ్గి తెగులు నివారణకు జాగ్రత్తలు పాటించి వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని అధికారులు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మండలంలో రైతులు అధికంగా వరిసాగు చేశారు. 30-45 రోజుల వయస్సు గల వరి పంటలకు అగ్గి తెలుగు వస్తుందని వాటి నివారణకు సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడిని సాధించవచ్చు. ఈ తెగులు ద్వారా పంట పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 

అగ్గి తెగులును గుర్తించే విధానం..

అగ్గి తెగులు మొదటగా ముదురు ఆకులపై మచ్చలు రావడం. మచ్చ మధ్యలో తెల్లని రంగు కలిగి ఉంటుంది. 

 ఉధృతి ఎక్కువైనప్పుడు చెను మొత్తం అంచుల నుంచి మాడిపోయినట్లు అవుతుంది. 

ఈ తెలుగు ఆశించడానికి ఉదయం పూట ఉష్ణోగ్రత ఉండడం, మధ్యాహ్నం ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. 

నివారణ చర్యలు..

మొదట అగ్గి తెగులును గుర్తించినట్లయితే ఎకరాకు వరి పంటకు ట్రైసైక్లోజోల్‌ 120 గ్రాములు, ఐసోప్రోతోనైల్‌ 300 గ్రాములు, కానుగమైసిన్‌ 200 గ్రాములు, నాటివో 200 గ్రాములు మందులను 200 లీటర్ల నీటిలో కలిపి మార్చి మూడు సార్లు పిచికారి చేయాలి. దీంతో వరిపంటకు పట్టిన అగ్గి తెగులును నివారించవచ్చు.logo
>>>>>>