మంగళవారం 07 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 03, 2020 , 23:52:15

పశువుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

పశువుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలిl ఎంపీపీ కిచ్చారెడ్డి

వనపర్తి రూరల్‌ : పాడి పశువులు ఎంత ఆరోగ్యంగా ఉం టే పాడి అంతగా వృద్ధి చెందుతుందని ఎంపీపీ కిచ్చారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని సవాయిగూడెం గ్రా మంలో గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమానికి హాజరై పశువులకు టీకాలను వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులున్న ప్రతి పాడి రైతు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలను వేయించుకోవాలన్నారు. అనంతరం మండల పశువైద్యాధికారి ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామంలో సోమవారం 120 ఆవులకు, 72 గేదెలకు వ్యాధి నివారణ టీకాలను వేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జూనియర్‌ వెటర్నరీ ఆఫీసర్‌ హరిశ్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ చక్రవర్తి, గోపాలమిత్ర నరేంద్ర, తిరుపతయ్య, వెంకటయ్య, అబ్దుల్‌ పాల్గొన్నారు.

చెన్నూరులో..

గోపాల్‌పేట : మండలంలోని చెన్నూరు గ్రామంలో సోమవారం మండల పశువైద్యశాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ శేషిరెడ్డి పశువులకు టీకాలను వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పశువైద్యుడు ఉదయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ టీకాలు వేసిన ప్రతి పశువుల చేవులకు టాగ్‌ వేసి పశువుల, యాజమాని వివరాలను అంతర్జాలంలో పొందుపరచడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో తెల్ల పశువులు 07,  179నల్ల పశువులకు టీకాలను వేసినట్లు తెలిపారు. అలాగే మంగళవారం మున్ననూర్‌ గ్రామంలో పశువులకు టీకాలు వేసే కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు. కార్యక్రమంలో  వార్డు సభ్యులు రాంబాబు, గ్రామస్తులు నారాయణరావు, జేవీవో వెంకటరమణమ్మ, వీఏ  బద్రీనాథ్‌, గోపాలమిత్ర తిరుమల్‌, శోభన్‌బాబు పాల్గొన్నారు.

ఖిల్లాఘణపురంలో..

ఖిల్లాఘణపురం : పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని పాడి రైతులకు జెడ్పీటీసీ సామ్యనాయక్‌, మండల పశువైద్యాధికారి సుసన్‌కేసిలు సూచించారు. సోమవారం మండల కేంద్రంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కృష్ణయ్యతో కలిసి జెడ్పీటీసీ సామ్మనాయక్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  మండల కేంద్రంలో మొత్తం 130 పశువులకు టీకాలు వేసినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో జూనియర్‌ పశువైద్యాధికారి రామేశ్వర్‌, నగేశ్‌కిశోర్‌, పద్మావతి, సిబ్బంది వెంకటేశ్‌, అనిత, శంకరయ్య, వెంకటన్న, పాడి రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 


logo