ఆదివారం 24 మే 2020
Wanaparthy - Feb 03, 2020 , 00:49:55

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

 వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి


కుటుంబ సభ్యులకు చెక్కు అందజేసిన మంత్రి 

ఖిల్లాఘణపురం : ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సీఎం సహాయనిధి అండగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని సోలీపూర్‌ గ్రామానికి చెందిన భవాని భర్త పాండుకు సీఎం సహాయనిధి నుంచి మంజురైన రూ.29వేల చెక్కును ఆదివారం గ్రామానికి వచ్చిన మంత్రి బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా పాండుకు రూ.29 వేల చెక్కు మంజురైందని, అట్టి చెక్కును బాధిత కుటుంబానికి అందజేసినట్లు ఆయన చెప్పారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్‌కు, మంత్రి నిరంజన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సోలీపూర్‌ గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి తల్లి రాంచంద్రమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆదివారం నిర్వహించిన దశదిన కర్మలో మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. 


logo