ఆదివారం 29 మార్చి 2020
Wanaparthy - Feb 03, 2020 , 00:46:58

ఓం నమో వేంకటేశాయ

ఓం నమో వేంకటేశాయ

ఖిల్లాఘణపురం : మండలంలోని గట్టుకాడిపల్లె గ్రామంలో ఆరు రోజుల పాటు శ్రీలక్ష్మి అలివే లు మంగ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు చాంద్రమాన శ్రీవికారి నామ సంవత్సర మాఘ శుద్ధ ఏకాదశి ఈ నెల 5వ తేదీ నుంచి మాఘ బహుళ పాడ్య మి 10వ తేదీ వరకు గ్రామంలో ని అంజనగిరి దేవస్థానములో ఘనంగా నిర్వహించెందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలలో భాగ ంగా వేంకటేశ్వర స్వామి రథోత్సవంను నూతన అంగులతో సిద్ధం చేస్తున్నారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామలతోపాటు వివిధ గిరిజన తండాల ప్రజలు వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో పాల్గొంటారు. వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి రోజు అభిషేకం, బలిహరణం శాత్తుమురై, తీర్థ ప్రసాద వినియొగంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేవాలయం వద్ద ఉన్న కోండపై ఉన్న స్వామి దర్శనానికి వెళ్లిన భక్తులకు అక్కడి సుందర ప్రకృతి, చల్లని  నీటితో నిండి ఉండే కోనేర్లులో సరదగా గడుపుతరు. భక్తులు ఉత్సాహంగా స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటా రు. అయా గ్రామాల నుంచి వచ్చిన యువకులు గోవింద నామస్మరణతో స్వామి వారిని కోలుస్తారు. ప్రతి ఎడాది ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వాహించడం అనవాయితీగా వస్తున్న అచారం. 


5వ తేదీన క్షీరాభిషేకం, కోవిల్‌ అళ్వార్‌ తిరుమంజనం, యోగశాల ప్రవేశం, అంకురార్పణం, గురువారం, ధ్వజారోహణము, గరుడసేవ, ఎదుర్కోలు, శాత్తుమురై, తీర్థ ప్రసాదములు, శుక్రవారం, తిరుక్కల్యాణ మహోత్సవం, హన్మతసేవ, శాత్లుములై, తీర్థ ప్రసాదములు, ముఖ్యఅతిథి మంత్రి దంపతులు, ఎంపీటీసీ లావణ్య పురుషోత్తంలు కల్యాణోత్సవంలో పాల్గొంటారు. శనివారం, మహాసుదర్శనహవనం, బలిహరణములు, ఆదివారం, ఆలయ శుద్ధీ, బలిహరణము, అనంతరం రాత్రి 11 గంటలకు రథోత్సవాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా అక్కడికి వచ్చిన భక్తులకు దాతలు టీఆర్‌ఎస్‌ నాయకుల సహయంతో అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. 10న శేషవాహనము, ధ్వజావరోహణం, సప్తావర్ణాలు, ఋత్విక్కులకు సన్మానము తదితర కార్యక్రమాలను నిర్వహించెందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా కల్యాణోత్సవం, హోమములలో పాల్గొనదలచిన భక్తులు రూ.1116లు చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకొనగరని నిర్వాహకులు తెలిపారు.


logo