సోమవారం 06 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 03, 2020 , 00:40:45

సంగీత విద్వాంసులకు నిలయం ‘వనపర్తి’

సంగీత విద్వాంసులకు నిలయం ‘వనపర్తి’

వనపర్తి సాంస్కృతికం : సంగీత విద్వాంసులకు వ నపర్తి జిల్లా నిలయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో సద్గురు త్యాగరాయ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో టీటీడీ కల్యాణ మండపంలో ని ర్వహించిన త్యాగరాయ ఆరాధనోత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇక్కడి సంగీత విద్వాం సులు రాష్ట్ర స్థాయిలో ప లు అవార్డులు అందుకు న్నారని గుర్తు చేశారు. జిల్లాలో ఎంతో మంది కళాకారులు, సంగీత విద్వాంసులు, ప్రముఖులు ఉన్నారని, వీరందరి కీ చేతనైన సహకారం అందిస్తానని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్‌ కోదండపాణి, ప్ర ముఖ రంగస్థల కళాకారులు బెల్లం సాయిలు, పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌లను సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్‌ గుంటి గోపి, నాగేంద్రం, కల్వరాల శ్రీ నివాసులు, మనిగిల్ల వెంకట్రాములు, మాందా పురం కృష్ణయ్య, మియ్యాపురం సీతారాములు, వీ పనగండ్ల బాలరాజు, నారాయణ తదితరులున్నారు.


logo