బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 03, 2020 , 00:39:49

పట్టణాభివృద్ధికి కృషి చేస్తాం..

పట్టణాభివృద్ధికి కృషి చేస్తాం..

వనపర్తి, నమస్తే తెలంగాణ : వనపర్తి పట్టణాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సహకారంతో అధికారుల సమన్వయంతో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటిశ్రీధర్‌లు అన్నారు. ఆదివారం పట్టణంలోని 30వ వార్డు ప్రజలు మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించా రు. ఈ సందర్భంగా వారు 30వ వార్డు మొత్తం పర్యటించి వార్డులో గల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తమకు ఫోన్‌ ద్వారా తెలియజేయాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కార దిశగా సాగడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని వారు ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు ప్రజలు ఉన్నారు. logo