సోమవారం 06 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 03, 2020 , 00:33:19

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
  • యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి

వనపర్తి విద్యావిభాగం : ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చే యాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధ్యక్షుడు కృష్ణ య్య అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్‌ విద్య సంస్థలను ప్రోత్సహించడం వలన ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం పరుస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విద్యకు నిధుల కేటాయింపు దారుణంగా ఉందని విమర్శించారు. ఉన్నత విద్యను ప్రైవేట్‌ రంగానికి అప్పజెప్పడం దారుణమన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రవిప్రసాద్‌గౌడ్‌, యూటీఎఫ్‌ ఉపాధ్యక్షుడు అమీ ద్‌, జ్యోతి, కార్యదర్శి రామన్‌గౌడ్‌, వెంకటేశ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, తిమ్మ ప్ప, చిరంజీవి, మురళి, నాయకులు నరేందర్‌, చంద్రయ్య, నాగరాజు, వెంకటయ్య, కృష్ణ, బద్రునాయక్‌, లక్ష్మణ్‌నాయక్‌, బాలీశ్వర్‌, నారాయణ ఉన్నారు. 


logo