శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 02, 2020 , 00:49:06

గమ్యం కన్నా ప్రాణం విలువైనది

గమ్యం కన్నా ప్రాణం విలువైనది
  • మానవ తప్పిదమే ప్రమాదాలకు కారణం
  • రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన
  • ప్రజా సంక్షేమానికే నిబంధనల అమలు : డీటీవో నరేందర్‌ నాయక్‌
  • మైనర్లకు వాహనాలివ్వొద్దు

పెబ్బేరు : త్వరగా వెళ్లాలనే ఆ త్రుతతో వేగంగా వెళ్లడం వల్ల ప్ర మాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, గమ్యం కన్నా ప్రాణం విలువైందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వనపర్తి డీటీవో న రేందర్‌ నాయక్‌ సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భా గంగా శనివారం స్థానిక మోటరు వెహికిల్‌ కార్యాలయంలో ఎంవీ ఐ సతీశ్‌కుమార్‌ డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులకు అవగాహన కా ర్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హాజరై న డీటీవో మాట్లాడుతూ మానవ తప్పిదాల కారణంగా నే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి ఒ క్కరూ రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమన్నారు. లైసెన్స్‌ వచ్చేదాక వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. ప్రతి వాహనదారుడు ధ్రువపతాల్రను వెంట ఉంచుకోవాలని చెప్పారు.


కొత్తకోట ఎక్సైజ్‌ సీఐ ఓంకార్‌ గౌడ్‌ మాట్లాడుతూ ప్రమాదాలను నివారించేందుకు పోలీస్‌ యంత్రాంగం చట్టం పరిధిలో పనిచేస్తూ పెట్టే ఆంక్షలకు ప్రజలు ఇబ్బంది పడకుండా సహకరించాలన్నారు. ప్రజాసంక్షేమం కోసమే ప్రభుత్వం నిబంధనలు అమలు చేస్తుందన్నారు. ద్విచక్ర వాహనదారు డు హెల్మెట్‌ ధరించాలని, పెద్ద వాహనదారులు తప్పనిసరిగా సీట్‌ బెల్టు పెట్టుకోవాలని సూచించారు. వాహనాల ధ్రువపత్రాలు, భీమా పాలసీలు, ట్రాఫిక్‌ నిబంధనలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అ నంతరం వివిధ షోరూంల వారు వితరణ చేసిన హెల్మెట్లను ద్విచక్ర వాహనదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ డ్రైవర్లను శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో 44వ జాతీ య రహదారి మేనేజర్‌ వికాస్‌ సింగ్‌, తుఫాన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉశన్న, డీసీఎం, లారీ అసోసియేష న్‌ సభ్యులు రాజు, అబీబ్‌, డ్రైవర్లు, సిబ్బంది ఉన్నారు.


రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సీఐ సీతయ్య పేర్కొన్నారు. 31వ రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం పట్టణంలో హెల్మెట్‌ ధారణతో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని, హెల్మెట్‌ను తప్పక ధరించాలని సూచించారు. హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రాణహాణి ఉండదని పేర్కొన్నారు. లైసెన్స్‌ కలిగిన వారే వాహనాలను నడపాలని, మద్యం సేవించి వాహనాలను నడపరాదని సూచించా రు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని అన్నారు. ఎస్‌ఐ ముత్తయ్య మాట్లాడుతూ వాహనదారుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న రహదారి భద్రతా వారోత్సవాలను జయప్ర దం చేయాలని కోరారు. కార్యక్రమంలో పోలీసు సి బ్బంది, పట్టణ యువకులు పాల్గొన్నారు. 


logo