ఆదివారం 24 మే 2020
Wanaparthy - Feb 02, 2020 , 00:47:45

విండో ఎన్నికలకు 15 మంది ప్రత్యేక అధికారులు

విండో ఎన్నికలకు 15 మంది ప్రత్యేక అధికారులు
  • నేడు ఎన్నికలపై శిక్షణ
  • పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాట్లపై దృష్టి
  • ఓటరు లిస్టులు, రిజర్వేషన్లు సిద్ధం

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని సహకార సంఘాల ఎన్నికల నేపథ్యంలో 15 సొ సైటీలకు 15 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ మేరకు కలెక్టర్‌ శ్వేతామొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక అధికారులకు నేడు జిల్లా సహకార శాఖ కార్యాలయంలో శిక్షణ ఇవ్వనున్నారు. సహకార ఎన్నికల ప్రారంభం నుంచి ఓటింగ్‌, కౌంటింగ్‌ల వరకు అవసరమయ్యే చర్యలన్నిటిపైనా శిక్షణ ఇవ్వనున్నారు. రేపటి నుంచి మొదలయ్యే ఎన్నికల ప్రక్రియ ఈనెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. శిక్షణ అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఆయా సొసైటీలకు సంబంధించిన ఓటర్ల జాబితాపై సా యంత్రం వరకు శిక్షణ ఇవ్వనున్నారు. సాయ ంత్రం ఆయా సొసైటీలకు చెందిన ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల వివరాలను ప్రత్యేక అధికారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. 

ఓటరు లిస్టులు సిద్ధం..

జిల్లా సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించిన ఓటరు లిస్టుల జాబితాలు సిద్ధం అయ్యాయి. అలాగే ఓటరు లిస్టులను అనుసరించి రిజర్వేషన్ల ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది. ఓటరులిస్టుల జాబితాలపై అధికారులు స్క్రూట్నీ చేస్తున్నారు. నేటి మధ్యాహ్నం వరకు ఈ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఆ యా సొసైటీల వారీగా సిద్ధమైన పలు జాబితాలు ఓ కొలిక్కివచ్చాయి. మరో ఐదు సొసైటీల కు చెందిన ప్రక్రియ కొనసాగుతుంది. నేడు వీటిని సహితం పూర్తి చేసి ప్రత్యేక అధికారులకు అందించడం ద్వారా అసలు ప్రక్రియ సోమవారం నుంచి మొదలుకాబోతుంది.


పోలింగ్‌స్టేషన్ల ఏర్పాట్లపై..

జిల్లాలోని సహకార ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటును జిల్లా సహకార శాఖ అధికారి కోదండ రాములు పర్యవేక్షణ జరిపారు. ఈ మేరకు జిల్లాలో ని పెబ్బేరు, శ్రీరంగాపురం, తూంకుంట, నాగవరం, రాజనగరం, వనపర్తి, పాన్‌గల్‌ తదితర సొ సైటీలను శనివారం పరిశీలన చేశా రు. పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటుతోపా టు కార్యాలయాల్లోని ఎన్నికలకు సంబంధించిన సౌకర్యాలపై డీసీవో పరిశీలన జరిపారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను చేసే విధంగా అక్కడి సిబ్బంధికి పలు సూచనలు చేశారు.


logo