మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Feb 02, 2020 , 00:47:56

ఘనంగా రథసప్తమి

ఘనంగా రథసప్తమి
  • రంగనాథ స్వామికి సూర్యప్రభ,చంద్రప్రభ వాహనసేవ
  • కిటకిటలాడిన ప్రముఖ ఆలయాలు
  • గోపాల్‌పేటలో చెన్నకేశవ స్వామి కల్యాణం

పెబ్బేరు రూరల్‌ (శ్రీరంగాపురం) : శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగనాథ స్వామి ఆలయంలో శనివారం రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణలోనే ప్రముఖ వైష్ణవాలయంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా రథసప్తమి వేడుకలు నిర్వహించడం ఆనవాయి తీ. శనివారం ఉదయం సహస్ర తులసీ అర్చనతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత భూదేవి, శ్రీదే వి సమేతుడైన రంగనాథస్వామిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. గ్రామంలోని పలు వీధుల గుండా భాజాభజంత్రీలతో, బోయిలు పల్లకీ మోస్తుండగా స్వామి వారిని ఊరేగించారు. సాయంత్రం చంద్రప్రభ వాహనంపై సతీసమేత రంగనాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు. తీర్థప్రసాద గోష్టితో ఉత్సవాలు ముగిశాయి. 


వేంకటేశ్వరస్వామి ఆలయంలో..

వనపర్తి సాంస్కృతికం : జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాల్లో రథసప్తమిని పురస్కరించుకుని శనివా రం సుప్రభాత సేవ, పల్లకీ సేవలు నిర్వహించారు. పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో సుప్రభాత సేవలు, నక్షత్ర హారతి, సూర్యభగవానుడికి ఎదురుగా ఉంచి అర్చకులు ఆదిత్య ఉదయ పారాయణం నిర్వహించారు. రథసప్తమి శనివారం రావడంతో ప్రఖ్యాతి గాంచిన ఆలయాల్లో భక్తుల సందడి పెరిగింది. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త రఘునాథాచార్యులు, రాఘవాచార్యులు, రామచంద్రచార్యులు, భరణి సాగర్‌ ఆ చార్యులు, గంగాధర్‌, పోచ రవీందర్‌ రెడ్డి పాల్గొన్నారు. 


కనుల పండువగా చెన్నకేశవస్వామి కల్యాణం 

గోపాల్‌పేట : రథసప్తమిని పురస్కరించుకొని మండలకేంద్రంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో శనివా రం పూజారి రంగాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద మంత్రాలు, భాజా భజంత్రీల మధ్య చెన్నకేశవ స్వామి కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు మహిళాభక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనివాసులు, గ్రామస్తులు శివరాజు, శివకుమార్‌, శివచరణ్‌, హరికుమార్‌, దామోదర్‌, నాగరాజు, దిలీప్‌, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>