మంగళవారం 07 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 02, 2020 , 00:46:02

‘ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుతో పంటను అమ్ముకోవచ్చు’

‘ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుతో పంటను అమ్ముకోవచ్చు’

మదనాపురం : మామిడి ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుతో దళారుల ప్రమేయం లేకుండా తమ పంటలు తామే అమ్ముకోవచ్చని వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల ఉద్యానవన అధికారులు విజయభాస్కర్‌రెడ్డి, చంద్రశేఖర్‌లు అన్నారు. శనివారం మండల కేంద్రంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మామిడి ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మామిడి రైతులు పండించిన పంటను దళారుల చేతిలో పెట్టి నష్టపోకుండా తమ పంటను తాము అమ్ముకునేందుకు ఉత్పత్తిదారుల సంఘాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మామిడి రైతులు తమ పంటలు నష్టపోకుండా సంఘాలు కీలకంగా ఉంటాయని, అందుకు సంఘాల ఏర్పాటు అవసరమని అన్నారు. ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాకారం ఉంటుందని చెప్పారు. రైతులు పండించే పంటలలో వ్యవసాయ, ఉద్యానవన అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్‌ బాబు, మామిడి రైతులు పాల్గొన్నారు. 


logo