బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 02, 2020 , 00:45:30

ముగిసిన బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె

ముగిసిన బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె

వనపర్తి క్రీడలు : జిల్లా కేంద్రంలోని ఇందిరాపార్క్‌ సమీపంలో ఉన్న ఎస్‌బీఐ (ఏడీబీ) ముందు యూఎఫ్‌బీయూ సభ్యుల ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన దేశవ్యా ప్త సమ్మె శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయా శాఖలకు సంబంధించిన బ్యాంక్‌ సిబ్బంది మాట్లాడుతూ తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఇండియా బ్యాంక్‌ అసోసియేషన్‌ బ్యాంకింగ్‌ సేవలు అందిస్తున్న ఉద్యోగుల వేతనాన్ని స వరణ చేయాలని డిమాండ్‌ చేశారు. సమ్మెలో 9 యూనియన్ల బ్యాంక్‌ ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. logo