మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Feb 02, 2020 , 00:37:15

ప్రారంభమైన ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు

ప్రారంభమైన ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు

వనపర్తి విద్యావిభాగం : జిల్లాలో ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయని డీఈవో సింహయ్య తెలిపారు. శనివారం కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. మొదటి విడుతలో భాగంగా ఉదయం జరిగిన పరీక్షల్లో జనరల్‌ విభాగంలో 305 మంది విద్యార్థులకు గాను 302 మంది విద్యార్థులు హాజరు కాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 146 మందికి 125 మంది హాజరు కాగా 21 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 441 మంది విద్యార్థులను గాను 427 మంది హాజరై 24 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలో జనరల్‌ విభాగంలో 279 మందికి 277 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరు, ఒకేషనల్‌లో 150 మందికి 132 మంది హాజరు కాగా 18 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 429 మంది విద్యార్థులకు గాను 409 మంది హాజరు కాగా 20 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. 


logo
>>>>>>