శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 01, 2020 , 01:40:30

బాధితులకు అండగా సీఎమ్మార్‌ఎఫ్‌

బాధితులకు అండగా సీఎమ్మార్‌ఎఫ్‌
  • త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా..
  • చెక్కుల పంపిణీలో జిల్లా టాప్‌
  • వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
  • బాధితులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

వనపర్తి, నమస్తే తెలంగాణ : అనారోగ్యాల బారిన పడి మెరుగైన వైద్యం చేయించుకు న్న బాధితులకు సీఎం సహాయనిధి అండగా ఉందని, చెక్కుల పంపిణీలో వనపర్తి జిల్లా టాప్‌లో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం స హాయనిధి నుంచి విడుదలైన చెక్కులను శుక్రవారం సురేశ్‌ అనే బాధితుల నివాస గృహానికి వెళ్లి, మిగిలిన వారికి తన నివాస గృహంలో మంత్రి పంపిణీ చేశారు. బాధితుల ఆ రోగ్య క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అచ్చుతాపూర్‌ గ్రామానికి చెందిన విజయలక్ష్మికి రూ.17వేలు, నాగమ్మతండా కు చెందిన గోవిందుకు రూ.11,500, కీర్యాతండాకు చెందిన లావుడ్య సువాలికి రూ.15వేలు, కంబాళాపూర్‌కు చెందిన బంగారమ్మకు రూ.19వేలు, పొల్కెపహాడ్‌కు చెం దిన చిన్నయ్యకు రూ.18వేలు, వసంతకు రూ.18,500, వాల్యాతండాకు చెందిన లాలికి రూ.11,500, కోడేర్‌కు చెందిన శిరీషకు రూ.60వేలు, పొన్నకల్‌కు చెందిన రఫికి రూ. 15,500, గద్వాలకు చెందిన భార్గవ్‌కు రూ.60వేలు, కనిమెట్టకు చెందిన లక్ష్మికి రూ.60 వేలు, వనపర్తికి చెందిన సురేశ్‌కు రూ.60వేల విలువ గల చెక్కులను బాధితులకు అందజేశారు. అనంతరం వనపర్తికి చెందిన సురేశ్‌ కుటుంబసభ్యులు మంత్రి నిరంజన్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గుట్టయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటిశ్రీదర్‌, కౌన్సిలర్లు కృష్ణయ్య, కృష్ణను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ ప్రచార కార్యదర్శి మురళీసాగర్‌, నాయకుడు జోహెబ్‌ ఉన్నారు. 


logo