బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 01, 2020 , 01:39:46

నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం

నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం

పెబ్బేరు : చిన్నపాటి నిర్లక్ష్య మే పెద్ద ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఎస్పీ అపూర్వరావు పేర్కొన్నారు. 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మండలంలోని రంగాపూర్‌, అయ్యవారిపల్లి గ్రామాలకు చెందిన 80 మంది ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లకు శుక్రవారం పట్టణంలోని పీపీఎల్‌ గ్రౌండ్‌ ఆవరణ లో ఎస్సై రాఘవేందర్‌ రెడ్డి ఏ ర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హా జరయ్యారు. 80 ట్రాక్టర్లకు రేడియం కవర్లు అతికించడంతో పాటు ఇన్సూరెన్స్‌, వాహనాల ధ్రువపత్రాలు, లైసెన్స్‌ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్య ధోరణితో, మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల ఎక్కువ శాతం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. వాహనాలకు ముందు, వెనుక భాగాల్లో రే డియం స్టిక్కర్లు లేకపోవడంతో చిన్నదా..? పెద్దదా..? అని గుర్తించలేకపోతున్నారని చెప్పారు. కావున ప్రతి వాహనదారుడు విధిగా రేడియం స్టిక్కర్లు వాహనాలకు వేయించాలని సూచించారు. ఉరుకుల పరుగుల జీవితంలో వాహనాల ప్రాధాన్యత రోజురోజుకూ పెరిగిపోతుందన్నారు. ప్రమాదంలో మనం బాధితులం కావ చ్చు.. లేదా ఇతరులు బాధితులుగా మిగిలిపోయి వీధిన పడిన కుటుంబాలను చూస్తూనే ఉంటామన్నారు. ఈ నేపథ్యంలో వాహనదారుడితోపాటు, అతని వాహనం ప్రమాదం కారణంగా నస్టపోయిన ఇతరులకూ అన్ని విధాలుగా రక్షణ కల్పించే భీమా పాలసీలు తప్పనిసరి గా చేయించుకోవాలని సూచించారు. మోటరు వాహనాల చట్టం ప్రకారం వాహనాలకు తప్పనిసరిగా భీమా తీసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌, కొత్తకోట ఇన్‌చార్జి సీఐ సీతయ్య, ఏఎస్సైలు రాజశేఖర్‌రెడ్డి, జయన్న, పోలీసులు, వాహనదారులు, డ్రైవర్లు ఉన్నారు.


logo