శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 01, 2020 , 01:33:58

మెరుగైన బోధన చేయాలి

మెరుగైన బోధన చేయాలి

వనపర్తి విద్యావిభాగం : ఉపాధ్యాయులు అంకితభావంతో, నిబద్ధతతో విధులు నిర్వహించి మెరుగైన బోధనను అందించాలని డీఈవో సుశీందర్‌రావు సూచించారు. ఉపాధ్యాయుల సామర్థ్యాల పెంపునకు గాను శుక్రవారం నిర్వహిస్తున్న నిష్ఠ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు మానసిక సంసిద్గత ప్రెండ్లీ స్కూల్‌ సెప్టీ స్కూల్‌గా మార్చేందుకు ఉపాధ్యాయులే  మొదటి కౌన్సిలర్‌ అని అన్నారు. ఉపాధ్యాయుల పట్ల పిల్లల్లో గౌరవ భావనలు కలుగజేయాలని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, ఎవ్వరికి వారే విలువలతో కూడిన విద్య, విధుల పట్ల అంకితభావంతో నిర్వహించేందుకు తీర్మానాలు చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు సమయస్ఫూర్తిని ప్రదర్శించి నిబద్దతతో పనిచేయాలని, బోధనతో పాటు పాఠశాల అవరణలో ఉపాధ్యాయులందరు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్‌ శ్రీనివాస్‌గౌడ్‌, కన్వీనర్‌ శంకరయ్య, ఆర్పీలు జ్యోతి, యాదగిరి, మల్లేశ్‌, రంగస్వామి, సుదర్శనరావు ఉన్నారు. 


పెబ్బేరులో..

పెబ్బేరు : విద్యా బోధనలో వస్తున్న నూతన మార్పులను స్వీకరిస్తూ విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని డీఈవో సుశీందర్‌ రావు అన్నారు. నాలుగు విడుతల్లో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా శుక్రవారం ముగింపు నిష్ట శిక్షణ కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు బోధనలో మార్పునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మూస పద్ధతలకు బోధనకు స్వస్తి పలికి వినూత్న విధానాలతో బోధన చేసేలా ఉపాధ్యాయులకు నిష్ట శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. శిక్షణ శిబిరంలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో అమలుపరిచినప్పుడే శిక్షణ ఉద్దేశం నేరవేరుతుందని తెలిపారు. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థి సంపూర్ణ వికాసానికి తోడ్పడేలా విద్యా ప్రణాళికలను బలోపేతం చేయాలని సూచించారు. నిష్ట శిక్షణ కార్యక్రమంలో 495 మంది ఉపాధ్యాయులు అనేక అంశాలపై శిక్షణ పొందినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిష్ట కోర్స్‌ డైరెక్టర్‌ జయరాములు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


logo