శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 31, 2020 , 03:09:05

కొలువుదీరిన పురాధీశులు

కొలువుదీరిన పురాధీశులు
  • బాధ్యతలు చేపట్టిన మున్సిపల్‌ పాలకవర్గాలు
  • అభివృద్ధికి పునరంకితమవుతామని వెల్లడి
  • అభినందనలతో ముంచెత్తిన అభిమానులు
  • అమరులకు నివాళులర్పించి బాధ్యతల స్వీకరణ

వనపర్తి, నమస్తే తెలంగాణ : వనపర్తి పట్టణ అభివృద్ధి దిశగా స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, అధికారుల, ప్రజల సలమాల సూచనలతో ముందుకు తీసుకెళ్లుతానని మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ అన్నారు. గురువారం స్థానిక కౌన్సిలర్లు, అధికారుల సమక్షంలో మున్సిపాలిటీ కార్యాలయంలో పదవీ బాధ్యతలను చేపట్టారు. వేద పండితులతో ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఫోన్‌ ద్వారా సంప్రదించి తొలి సంతకాన్ని ఆయన చేశారు. ఈ సందర్భంగా అధికారులు, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు చైర్మన్‌ను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లుర్పించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌,  వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కాగితాల లక్ష్మీనారాయణ,  కృష్ణయ్య, పుట్టపాకుల మహేశ్‌, భాష్యనాయక్‌, సత్యనారాయణ సాగర్‌, నాగన్నయాదవ్‌, భువనేశ్వరి, రాములు యాదవ్‌,  శాంతి, ఉన్నీసాబేగం, చంద్రకళ, అలేఖ్య, నారాయణ,  రాఘవేంద్ర, లక్ష్మిదేవమ్మ, అలివేల, జంపన్న, కృష్ణ, నాయకులు, మున్సిపాలిటీ కమిషనర్‌ రజినీకాంత్‌రెడ్డి, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


logo