శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 31, 2020 , 03:07:19

రాజ్యాంగం హక్కులు సద్వినియోగం చేసుకోవాలి

 రాజ్యాంగం హక్కులు సద్వినియోగం చేసుకోవాలి
  • దేశంలో అన్ని వర్గాలకు సమానంగా జీవించే హక్కు ఉంది
  • పెద్దగూడెంలో పౌరహక్కుల దినోత్సవం
  • గాంధీజీ చిత్రపటం వద్ద ఘన నివాళి
  • జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి
  • గ్రామాల్లో అంటరానితనం దూరం చేయాలి

వనపర్తి రూరల్‌ : దేశంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా జీవించే హక్కును మన రాజ్యాంగం మనకు కల్పించిందని, దాన్ని  సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పెద్దగూడెం గ్రామ పంచాయతీలో తాసిల్దార్‌ రాజేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవానికి జెడ్పీ చైర్మన్‌ హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను ఎవరూ అతిక్రమించరాదని తెలిపారు. కుష్ఠు వ్యాధిగ్రస్తులను వేరుగా చూడరాదని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కొండన్న, ఉప సర్పంచ్‌ భాస్కర్‌గౌడ్‌, వార్డు సభ్యులు, కిష్టగిరి ఎంపీటీసీ ధర్మనాయక్‌, భాస్కర్‌రెడ్డి, బుచ్చిబాబు, భద్రయ్యగౌడ్‌, అశోక్‌, రామన్‌గౌడ్‌, శ్రీను, అధికారులు  పాల్గొన్నారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు వినియోగించుకోవాలి

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని మండల వ్యవసాయ అధికారి కార్యాల యంలో ప్రధాన మంత్రి మాన్‌-ధన్‌ యోజన పథకం పెన్షన్‌ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్‌ మాట్లాడారు.  ఉద్యోగులకే కాకుండా రైతులకు కూడా పెన్షన్‌ పొందవచ్చన్నారు. 18 ఏండ్ల నుంచి 40 ఏండ్ల వయస్సు, భూమి కలిగి ఉన్న చిన్న, సన్న కారు రైతులు ప్రధాన మంత్రి మాన్‌-ధన్‌ యోజన పథకం ద్వారా పెన్షన్‌ పొందవచ్చని తెలిపారు. దీని ద్వారా 60 ఏండ్లు దాటిన తరువాత నెలకు రూ. 3 వేల చొప్పున పెన్షన్‌ వస్తుందన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ కిచ్చారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కో- ఆర్డినేటర్‌ నరసింహ, మండల వ్యవసాయ అధికారి కురుమయ్య, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు. ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి కో- ఆర్డినేటర్స్‌, రైతులు పాల్గొన్నారు.


logo