ఆదివారం 24 మే 2020
Wanaparthy - Jan 31, 2020 , 03:06:18

మున్సిపాలిటీ అభివృద్ధే ప్రధాన ధ్యేయం

మున్సిపాలిటీ అభివృద్ధే ప్రధాన ధ్యేయం

పెబ్బేరు : మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి పర్చడమే ప్రధాన ధ్యేయమని ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణశ్రీ అన్నారు. గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో నూతనంగా ఆమెతో పాటు వైస్‌ చైర్మన్‌ కర్రెస్వామి పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముం దు గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహనికి పూలమాలలు వేసి నివాలర్పించారు. బాధ్యతలు చేపట్టినంతరం టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలోని సబండ వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటు పడుతామని పేర్కొన్నారు. ప్రజలు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. 


అదేవిధంగా మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నూతనంగా బాధ్యతలు చేపట్టిన మేకల కర్రెస్వామిని 11వ వార్డు టీఆర్‌ఎస్‌ నాయకులు మజీద్‌, నిజాం, అంజీ, బాలస్వామి తదితరులు శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. వార్డు అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. అదేవిధంగా 5వ వార్డు బీజేపీ కౌన్సిలర్‌ గోపిబాబును పార్టీ నాయకులు వేమారెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, సహదేవుడు, రవి కుమార్‌, రాఘవేందర్‌ గౌడ్‌లు శాలువ పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల శైలజ, టీఆర్‌ఎస్‌ జిల్లా సమన్వయకర్త ప్రమోద్‌కుమార్‌ రెడ్డి, కౌన్సిలర్లు సువర్ణ, ఎల్లారెడ్డి, రామకృష్ణ, పద్మ, సుమతి, అశ్విని, పార్వతి, ఎల్లస్వామి, గోపిబాబు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


logo