మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Jan 31, 2020 , 03:06:18

సాంతికేతిక పరిజ్ఙానంతోనే నేరాల అదుపు

సాంతికేతిక పరిజ్ఙానంతోనే నేరాల అదుపు

వనపర్తి టౌన్‌: సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు అదుపులోకి వస్తున్నాయని డీఎస్పీ కిరణ్‌కుమార్‌ అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గాయత్రి వృత్తి విద్య కళాశాలలో జరుగుతున్న నిష్ఠ శిక్షణ తరగతులలో రోడ్డు భద్రత వారోత్సవాలపై ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ డీజీపీ మహేందర్‌రెడ్డి మార్గదర్శకుడని, దేశంలోనే సాంకేతికతతో నేరాలను అదుపు చేసేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని, ఒక్క హైదరాబాద్‌లోనే 3లక్షల65వేల సీసీ పుటేజీలు ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. నేను సైతం ప్రోగ్రాంలో భాగంగా ప్రజలను, కార్పొరేట్‌ సంస్థలను భాగస్వామ్యం చేస్తూ దాతల ద్వారా సీసీ పుటేజ్‌లు ఏర్పాటు చేయించగలిగామన్నారు. పోలీస్‌ చట్టాలు, పోలీస్‌ వ్యవస్థ పటిష్ఠంగా ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉండి నేరాలు అదుపులోకి వస్తాయన్నారు. సీఐ సూర్యనాయక్‌ మాట్లాడుతూ ఎంతో డబ్బును వృథా చేస్తామని ఇన్సురెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తీసుకోని వాహనాలు నడపడం లేదన్నారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్‌గౌడ్‌, జీహెచ్‌ఎం శంకరయ్య, పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ మల్లికార్జున్‌ ఉన్నారు. 


logo
>>>>>>