గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 31, 2020 , 03:02:04

ఘనంగా ఎమ్మెల్యే చిట్టెం జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే చిట్టెం జన్మదిన వేడుకలు

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ: మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే చిట్టెం సతీసమేతంగా హాజరై కేక్‌ కట్‌ చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాయిత్రీయాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్‌ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఏర్పాటు చేశారు. చైర్‌పర్సన్‌ గాయిత్రీయాదవ్‌ దంపతులు ఎమ్మెల్యే దంపతులను గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. చిట్టెం యువసేన ఆధ్వర్యంలో భారీ ఎత్తున పటాకులు కాల్చారు. ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, విండో అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ కోటేశ్వర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి నాయకులు వీరేశలింగం, పు రం సుదర్శన్‌రెడ్డి, అనిల్‌గౌడ్‌, వెంకటనర్సింహారావు, సిరాజ్‌అహ్మద్‌, కోఆప్షన్‌ మహమూద్‌, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యే దంపతులను సన్మానించారు.


అమరచింతలో..

అమరచింతలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం టీఆర్‌ఎస్‌వీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు నరేశ్‌రెడ్డి నేతృత్వంలో స్థానిక రాజావళి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎంపీపీ మంగమ్మగౌడ్‌ నేతృత్వంలో దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ కట్‌ చేసి టీఆర్‌ఎస్‌ శ్రేణులకు, కార్యకర్తలకు అందించారు. సాయంత్రం కార్యక్రమానికి ఎమ్మెల్యే దంపతులు హాజరై మరోసారి కేక్‌ కట్‌ చేశారు. మండల నాయకులు, మున్సిపాలిటీ పాలకవర్గం, వివిధ గ్రా మాల సర్పంచులు, ఎంపీటీసీలు ఎమ్మెల్యే దంపతులను పూలమాలలు, షాలువాలతో సత్కరించారు. 


logo
>>>>>>