గురువారం 09 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 30, 2020 , 02:03:59

బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద సీసీ కెమెరాలు

బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద సీసీ కెమెరాలు


వనపర్తి టౌన్‌ : వనపర్తి జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అపూర్వరావు తెలిపారు. బుధవారం 44వ జాతీయ ర హదారిపై అధికారులతో కలిసి బ్లాక్‌స్పాట్‌లు, ప్రమాదకర మలుపులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బ్లాక్‌స్పాట్‌లో రోడ్డు ప్రమాదాలు జరిగితే సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులు బాధ్యతగా వెంటనే స్పందించి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదకర మలుపులు ఉన్న ప్రాంతాల్లోనే కాకుండా ఇరుకైన కల్వర్టులు, 3,4 దారులు కలిసే రద్దీ ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తకోట, పెద్దమందడి, పెబ్బేరు, బైపాస్‌లు, చిలకటోనిపల్లి క్రాస్‌ రో డ్డు, తోమాలపల్లి క్రాస్‌ రోడ్డు, కడుకుంట్ల క్రాస్‌ రోడ్డులతో పాటు ముఖ్య రహదారులు, మదనాపురం రైల్వే ట్రాక్‌, ఆత్మకూర్‌కు వెళ్లే రోడ్డు తదితర ప్రాంతాల్లో ప్ర మాద హెచ్చరిక బోర్డులను, రేడియం స్టిక్కర్లతో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ కిరణ్‌కుమార్‌, సీఐ మల్లికార్జున్‌రెడ్డి, ఎ స్సై విజయబాస్కర్‌, రాము, రాఘవేందర్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది తదితరలు ఉన్నారు. 


ప్రజలకు అవగాహన కల్పించాలి

పెద్దమందడి : రోడ్డు ప్రమాదాల నివారణకు ఎల్‌అండ్‌టీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ అపూర్వరా వు అన్నారు. మండలంలోని వెల్టూర్‌, బలీద్‌పల్లి స్టేజీ వద్ద 44వ జాతీయ రహదారిపై తరుచు గా జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు బుధవారం ఎల్‌అండ్‌టీ అధికారులకు పలు సూచనలు, స లహాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రెండు గ్రామాల ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రేడియంతో పాటు బారికేడ్లు ఏ ర్పాటు చేసి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అన్నారు. ప్రజలు రోడ్డుపై ఎక్కువ స్పీడుతో ప్రయాణించరాదని, హెల్మెట్‌ ధరించి వాహనాలు న డపాలని, రోడ్డు దాటే సమయంలో రెండు నిమిషాలైనా ఆపి అటు ఇటు చూడాలన్నారు. అనంతరం రెండు గ్రామా ల ప్రజలు స్టేజీల వద్ద విద్యుద్దీపాలు, సర్వీస్‌ రోడ్డు ను ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరారు. ఎస్పీతో పాటు ఎల్‌అండ్‌టీ అధికారి మదన్‌మోహన్‌, పోలీస్‌ సిబ్బం ది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 


logo