సోమవారం 06 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 30, 2020 , 01:58:08

పేదల ఇంట్లో కల్యాణకాంతులు

పేదల ఇంట్లో కల్యాణకాంతులు

వనపర్తి రూరల్‌ : ఆడపిల్లల పెండ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షా దీముబారక్‌ పథకం ద్వారా ఆర్థిక సహా యం అందిస్తున్నామని, దీంతో పేదల ఇండ్లల్లో కల్యాణకాంతులు సంతరించుకున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి తాసిల్దార్‌ కార్యాలయంలో 211 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం పథకాలను అమ లు చేస్తూ చేదోడువాదోడుగా నిలుస్తున్నదన్నారు. ఆడపిల్లల పెండ్లిళ్లు చేసేందుకు అప్పులతో ఇబ్బందులకు గురికావద్దన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పెండ్లి ఖర్చుల కింద రూ.లక్ష 116 ఆర్థిక సాయాన్ని అందిస్తుందన్నా రు. అధికారులు పారదర్శకత పాటించాలని సూచించా రు. ఈ పథకాన్ని పలు రాష్ర్టాల్లో అమలుపర్చేందుకు ఇ క్కడికి వచ్చి అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. అం దరి ఇంట్లో జరిగిన పెండ్లికి రాలేని పరిస్థితి ఉంటుందనే సహపంక్తి భోజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నా రు. 211 మందిలో 174 మంది బీసీలు, 21 మంది ఎ స్టీలకు కల్యాణలక్ష్మి, 16 మందికి షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి టిఫిన్‌ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ లక్ష్మయ్య, ఎంపీపీ కిచ్చారెడ్డి, కౌన్సిలర్లు, తాసిల్దార్‌ రాజేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo