గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 30, 2020 , 01:51:48

మంత్రి కేటీఆర్‌ను కలిసిన పాలకవర్గం

మంత్రి కేటీఆర్‌ను కలిసిన పాలకవర్గం

వనపర్తి, నమస్తే తెలంగాణ : వనపర్తి మున్సిపాలిటీ లో నూతనంగా ఎన్నికైన చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మ న్‌ వాకిటిశ్రీధర్‌, కౌన్సిలర్లు వ్యవసాయ శాఖ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్‌ రెడ్డితో కలిసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కౌన్సిలర్లను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. కార్యక్రమంలో అలివేల, అలేఖ్య,  జంపన్న, లక్ష్మీనారాయణ, కృష్ణయ్య, చంద్రకళ, రాములు యాదవ్‌, నారాయణ, ఉన్నీసా బే గం, పద్మమ్మ, కృష్ణయ్య, నాగన్న యాదవ్‌, భాష్యనాయక్‌, భారతి, భువనేశ్వరి, సమద్‌పాష, మహేశ్‌, మం జుల, రాఘవేందర్‌,  లక్ష్మీదేవి, శాంతి, సత్యనారాయణ సాగర్‌, సత్యమ్మ తదితరులు ఉన్నారు. 

రెవెన్యూ డివిజన్‌గా గుర్తించాలని వినతి..

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : ఆత్మకూరును రెవె న్యూ డివిజన్‌గా గుర్తించాలని, రోడ్డు విస్తరణ చేపట్టాలని మంత్రి కేటీఆర్‌కు ఆత్మకూరు కౌన్సిలర్లు వినతిపత్రం స మర్పించారు. బుధవారం కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీ శ్రీ ధర్‌గౌడ్‌, ప్రజాప్రతినిధులు మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో మంత్రి కేటీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలను అందజేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో, రైతు సమన్వయసమితి జిల్లా సభ్యురాలు చిట్టెం సుచరితరెడ్డి సారథ్యంలో త్వరగా హామీలు నెరవేర్చాలని కోరారు. మంత్రి ని కలిసిన వారిలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు కృష్ణమూర్తి, వై స్‌చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, జెడ్పీటీసీ శివరంజని, మం డలాధ్యక్షుడు రవికుమార్‌యాదవ్‌, కౌన్సిలర్లు రామకృష్ణ, పోషన్న, చెన్నయ్య, తబస్సుమ్‌బేగం ఉన్నారు. 

కౌన్సిలర్లను అభినందించిన మంత్రి.. 

కొత్తకోట : కొత్తకోట మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అందరూ కలిసికట్టుగా కొత్తకోటను అభివృద్ధి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌లు సుకేశిని, జయమ్మ, కౌన్సిలర్లు ఉన్నారు. 


logo
>>>>>>