గురువారం 09 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 29, 2020 , 01:33:55

పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధి

పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధి

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : పల్లెప్రగతితో గ్రా మాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర సీఐడీ అదన పు డీజీపీ గోవింద్‌ సింగ్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆ త్మకూరు మండలంలోని జూరాల, పిన్నెంచెర్ల గ్రామాల ను ఆయన సందర్శించారు. గ్రామాల్లో జరిగిన మొదటి, రెండో విడుత పల్లెప్రగతి పనులను పరిశీలించారు. చెత్త సేకరణ, డంపింగ్‌ యార్డ్‌, శ్మశానవాటిక, మరుగుదొడ్లు, నర్సరీలు, పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లను తనిఖీ చేశారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల గురిం చి అడిగి తెలుసుకున్నారు. పాడుపడ్డ ఇండ్ల కూల్చివేత, బావుల పూడ్చివేతను పర్యవేక్షించారు. జూరాలలో ఉన్న త పాఠశాల ఇంగ్లీష్‌ ల్యాబ్‌ను సందర్శించిన ఆయన ఆ శ్చర్యానికి గురైయ్యారు. దీనికి కారణమైన ఆంగ్ల ఉపాధ్యాయుడు సంతోష్‌కుమార్‌ను అభినందించారు. వి ద్యార్థుల నైపుణ్యాల సామర్థ్యాలను పరీక్షించారు. అంగన్‌వాడీ సెంటర్లలో రికార్డులను పరిశీలించి వంట, భోజ నం వసతులపై ఆరాతీశారు. రికార్డులను సక్రమంగా ని ర్వర్తించాలని సూచించారు. గ్రామంలో స్వయం సహా య మహిళా సభ్యులతో మాట్లాడిన ఆయన వారి రుణా లు, ఖర్చులు, అప్పు తీర్చుట, ప్రభుత్వ సహకారం పట్ల చర్చించారు. పిన్నెంచెర్లలోనూ పాఠశాల, అంగన్‌వాడీలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించా రు. అంగన్‌వాడీ చిన్నారులతో ఆహ్లాదంగా గడిపారు. వైకుంఠధామం, ఇంకుడు గుంతలు, డంపింగ్‌యార్డ్‌, నర్సరీలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పల్లెప్రగ తి పనులతో గ్రామాలు అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయన్నారు. ప్రజలందరూ మరింత భాగస్వాములై అభివృద్ధి పనుల్లో తోడ్పాటునందిస్తే పల్లెలు ప్రగతిపథంలో దూసుకుపోతాయన్నారు. అనంతరం సర్పంచ్‌ విజయలక్ష్మిగౌడ్‌ డీజీపిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో ఏఎస్పీ షాకీర్‌హుస్సేన్‌, డీఎస్పీ కేఎం కిరణ్‌కుమార్‌, సీఐ సీతయ్య, ఎస్‌ఐ ముత్తయ్య, డీపీవో రాజేశ్వరి, ఎం పీడీవో కృష్ణయ్య, జూరాల సర్పంచ్‌ మహిముదా, ఎంపీటీసీ పరమేశ్‌, ఈజీఎస్‌ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 


logo