గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 29, 2020 , 01:28:42

నర్సరీల నిర్వహణ ఇలాగేనా?

 నర్సరీల నిర్వహణ ఇలాగేనా?

పెబ్బేరు రూరల్‌ : హరితహారం విజయవంతానికి గాను గ్రామానికో నర్సరీలను ఏ ర్పాటు చేస్తే వాటి నిర్వహణ తీరు ఇదేనా..? అంటూ కలెక్టర్‌ శ్వేతామొహంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెబ్బేరు మండలంలోని జనుంపల్లి, పెంచికలపాడు గ్రామాల్లోని నర్సరీలను, డంపింగ్‌ యార్డులను మంగళవారం కలెక్టర్‌ పరిశీలించారు. అధికారులు నర్సరీల నిర్వహణను పట్టించుకోకపోవడంపై ఆమె మండిపడ్డారు. నర్సరీల రక్షణకు కనీసం కం చెను కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని త ప్పుబట్టారు. జనుంపల్లి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శ్రీరాముడును సస్పెండ్‌ చేయాల్సిందిగా డీఆర్‌డీ వో గణేశ్‌ను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కల పెంపకం విజయవంతానికి వ్యయ ప్రయాసాలతో గ్రా మానికో నర్సరీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. నర్సలోని మొక్కలను గ్రామంలో నాటి పల్లెను హరితవనం చేయాలని తెలిపా రు. స్వచ్ఛభారత్‌లో భాగంగా అన్ని గ్రామా లు పరిశుభ్రంగా ఉండేందుకు డంపింగ్‌ యా ర్డులను నిర్మిస్తున్నట్లు చెప్పారు. జనుంపల్లిలో నర్సరీ ఏర్పాటుకు గాను స్థలాన్ని మార్చేందుకు పాఠశాల ఆవరణను, పెంచికలపాడులో నర్సరీని కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో రెండు గ్రామాల సర్పంచులు రాజవర్ధన్‌రెడ్డి, గోవిందునాయుడు, ఎంపీడీవో కాలూసింగ్‌ పాల్గొన్నారు. 


logo